మహేష్ భలే సెట్ చేసినట్లున్నాడు!

Mahesh-Babu-Spyder-Teaser-Release-Date!తన పుట్టినరోజు కంటే తన తండ్రి పుట్టినరోజుకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ… ఫస్ట్ లుక్ గానీ, ఫస్ట్ టీజర్ గానీ విడుదల చేయడం మహేష్ కు ఆనవాయితీగా మారింది. అయితే ఈ సారి తండ్రితో పాటు తనయురాలు సితార, తనయుడు గౌతమ్ పుట్టినరోజులను కూడా మరింత స్పెషల్ గా మార్చేస్తున్నాడు ప్రిన్స్ మహేష్ బాబు. అవును… ఈ నెల 20వ తేదీన సితార పుట్టినరోజు సందర్భంగా “స్పైడర్” సినిమాకు సంబంధించిన కొత్త టీజర్ అభిమానులను పలకరించబోతుందన్న వార్త ఫ్యాన్స్ లో నూతన ఉత్సాహాన్ని నింపుతోంది.

ADVERTISEMENT

అలాగే ఆగష్టు 31వ తేదీన గౌతమ్ పుట్టినరోజు నాడు ఫ్యాన్స్ కు అసలు ‘సర్ ప్రైజ్’ ఇవ్వబోతున్నట్లుగా తెలుస్తోంది. సెప్టెంబర్ 27వ తేదీన విడుదల “స్పైడర్” సినిమాకు సంబంధించిన ధియేటిరికల్ ట్రైలర్ ను ఆగష్టు 31వ తేదీన విడుదల చేయబోతున్నట్లుగా సమాచారం. అప్పటికి సినిమా విడుదలకు మరో 25 రోజులు మాత్రమే ఉంటుంది గనుక, పబ్లిసిటీకి కూడా ఈ డేట్ అయితే సరిగ్గా సరిపోతుందని చిత్ర యూనిట్ భావిస్తోందట. మరి ఇలా అందరి పుట్టినరోజులకు సర్ ప్రైజ్ ఇస్తున్న మహేష్, తన పుట్టినరోజు నాడు ఏమీ విడుదల చేయరా? అంటే…

అప్పుడు కూడా ఫ్యాన్స్ ను నిరుత్సాహపరచను అంటున్నారు. అవును… “స్పైడర్” సినిమాకు సంబంధించిన లేటెస్ట్ పోస్టర్స్ తో పాటు, ఓ పాటను విడుదల చేయాలని సన్నాహాలు చేస్తున్నారట. అలాగే కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న “భరత్ అనే నేను” సినిమాకు సంబంధించి కూడా టైటిల్ లోగోను గానీ, ఫస్ట్ లుక్ పోస్టర్ ను గానీ విడుదల చేయడానికి సిద్ధమవుతున్నట్లుగా లభించిన కీలక సమాచారం. అలాగే వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమా టైటిల్ ప్రకటన కూడా ఉండవచ్చని తెలుస్తోంది.

ADVERTISEMENT
Latest Stories