తొలి ఐఫా విన్నర్ “శ్రీమంతుడు” మహేష్ బాబు!

mahesh-babu-srimanthudu-is-iifa-utsavam-2016-winnerఉత్తరాదికే పరిమితమైన ‘ఐఫా’ అవార్డులు తొలిసారిగా దక్షిణాదిలోనూ సందడి చేసాయి. దాదాపు తెలుగు సినీ సెలబ్రిటీలనంతా ఏకం చేసిన ఈ ‘ఐఫా’ ఉత్సవంలో “శ్రీమంతుడే” హీరో అయ్యాడు. ప్రిన్స్ మహేష్ బాబు నటించిన “శ్రీమంతుడు” సినిమా ఈ వేడుకలో అత్యధిక అవార్డులను సొంతం చేసుకుంది. బెస్ట్ యాక్టర్, బెస్ట్ యాక్ట్రెస్, సపోర్టింగ్ రోల్ మేల్, ప్లే బ్యాక్ సింగర్ మేల్, మ్యూజిక్ డైరెక్టర్, లిరిక్స్ విభాగాల్లో ఈ మూవీకి అవార్డుల పంట పండింది. మొత్తం ఆరు అవార్డులను “శ్రీమంతుడు” చిత్రం దక్కించుకుంది.

ఇక రాజమౌళి తీసిన “బాహుబలి” ఐదు అవార్డులు గెలుచుకుంది. రానా దగ్గుబాటి, రమ్యకృష్ణలు అవార్డులు కైవసం చేసుకోగా.. రాజమౌళి బెస్ట్ డైరెక్టర్ గా ఎంపికయ్యారు. సినీ తారా లోకమంతా ఈ ఈవెంట్ లో పాల్గొని హైదరాబాద్ లో సందడి చేసింది. ఈ ఉత్సవానికి మహేష్ బాబు దంపతులు, చిరంజీవి, రామ్ చరణ్, నాగార్జున దంపతులు, వెంకటేష్, బాలకృష్ణ, రవితేజ, హీరోయిన్లు రెజీనా, తమన్నా, తాప్సీ , పూనం కౌర్ వంటి సెలబ్రిటీలంతా హాజరై కనువిందు చేశారు

ADVERTISEMENT
ADVERTISEMENT
Latest Stories