వద్దు…వద్దు అంటూనే…టైమ్ ఇస్తున్నాడా?

Mahesh Babuమరో రంగస్థలం లాంటి సినిమా చేద్దాం అనుకుంటున్న మహేష్ కి అసలు టైమ్ కలసి రావడం లేదు. ఒక పక్క మహర్షి సినిమాలో బిజీగా ఉంటూనే మరో పక్క తన నెక్స్ట్ సినిమా విషయంలో కాస్త ఇబ్బంది పడుతూ ఉన్నారు మహేష్. దాదాపుగా రంగస్థలం సినిమా వచ్చి వెళ్ళి, 7 నుంచి 8 నెలలు పైనే అయ్యింది. కానీ అప్పటినుంచి మహేష్ ని మెప్పించే మంచి కధ చెప్పలేక పోయాడు మన క్రియేటివ్ దర్శకుడు సుకుమార్.

[m9ad]

ADVERTISEMENT

తాజాగా కూడా ఒక డిఫరెంట్ సబ్జెక్ట్ ఒకటి చెప్పినప్పటికీ అది రిస్క్ తో కూడిన ఎవ్వారం అని, వేరే కధ చూడమని, సుకుమార్ చెబుతున్న కధలను వద్దు..వద్దు అంటూనే ఇప్పటివరకూ మహేష్ ఆయనకి టైమ్ ఇస్తూ వచ్చాడు. కట్ చేస్తే, ఇక నా వల్ల కాదు…ఇంకో నెల టైమ్ ఉంది, జనవరి లోపు మరో మంచి కధ, మన కాంబినేషన్ సెట్ అయ్యే కధ చెప్పగలిగితే, ఇద్దరం సినిమా చేద్దాం, లేదంటే మరొక దర్శకుడితో సినిమా ఓకే చేసేస్తా అన్నట్లుగా ప్రిన్స్ చెప్పినట్లు సమాచారం. అయితే ప్రిన్స్ హ్యాట్రిక్ హిట్ కోసం మరో మారు కొరటాల శివతో జతకట్టనున్నాడు అని సైతం తెలుస్తుంది. ఈ క్రమంలో సుకుమార్ ఒకవేళ మహేష్ ను మెప్పించకపోతే ప్రిన్స్ తన తరువాత సినిమా కొరటాలకి ఓకే చేసేస్తాడు.

మరి రంగస్థలం లాంటి కమర్షియల్ హిట్ ఇచ్చిన సుకుమార్, ప్రిన్స్ కధ కోసం ఎందుకింత ఇబ్బందులు పడుతున్నాడో తెలీదు కానీ. మొత్తంగా చూస్తే మాత్రం అతనికి ఈ సంక్రాంతి డెడ్ లైన్ గా చెప్పవచ్చు. మరి ఈలోపు ఆయన కధను రెడీ చేస్తాడా? లేదా? అన్నది ఆయన బ్యాంకాక్‌ నుంచి వస్తే గాని చెప్పలేం…ఎందుకంటే ప్రస్తుతం సుకుమార్ మరో లైన్‌ వర్క్‌ చేయడానికి తన టీమ్‌తో కలిసి బ్యాంకాక్‌ వెళ్లాడుగా!

ADVERTISEMENT
Latest Stories