మహేష్ కు కరోనా… సూపర్ స్టార్ సందేశం!

mahesh babu tests corona positive“సర్కార్ వారి పాట” సినిమాకు సంబంధించి అప్ డేట్ వస్తుందని భావించిన మహేష్ బాబు అభిమానులకు చేదు వార్త వచ్చింది. తనకు కరోనా సోకిందని సూపర్ స్టార్ మహేష్ బాబు ట్విట్టర్ ద్వారా ప్రకటించారు.

కరోనా నిబంధనలను పాటిస్తున్నప్పటికీ, నాకు పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. అయితే కేవలం నామమాత్రపు లక్షణాలు మాత్రమే ఉన్నాయి. ఇంటిలోనే ఉంటూ మెడిసిన్ తీసుకుంటున్నాను.

ADVERTISEMENT

ఇటీవల కాలంలో నా వద్దకు వచ్చిన వారందరూ టెస్ట్ చేయించుకోవాల్సిందిగా కోరుచుకున్నాను. అందరూ వాక్సిన్ వెంటనే తీసుకోండి, దాని వలన రిస్క్ తగ్గుతుంది, హాస్పిటల్ కు వెళ్లాల్సిన అవసరం ఉండదు.

ప్లీజ్… కోవిడ్ నిబంధనలను పాటించండి. మళ్ళీ మిమ్మల్ని కలవడానికి నిరీక్షిస్తున్నాను అంటూ ఓ సందేశాన్ని తన అభిమానులకు మరియు శ్రేయోభిలాషులకు అందించారు మహేష్ బాబు.

ఇటీవల కాలంలో సీఎంలు, సెలెబ్రిటీలు అన్న తావు లేకుండా కరోనా వ్యాప్తిస్తోన్న నేపధ్యంలో… మహేష్ చెప్పినట్లుగా వాక్సిన్ వేయించుకుని, కరోనా నిబంధనలను పాటించాలని పిలుపునిస్తున్నాం.

ADVERTISEMENT
Latest Stories