ధియేటర్ రంగ విభాగంలోకి ప్రిన్స్ మహేష్ బాబు అడుగుపెడుతున్న విషయం ఇటీవల చక్కర్లు కొట్టిన సంగతి తెలిసిందే. అధికారికంగా ఇంకా ప్రకటన చేయకపోయినా, దీనికి సంబంధించిన బ్యాక్ గ్రౌండ్ వర్క్ శరవేగంగా జరుగుతోంది. ఏషియన్ ఫిలిమ్స్ తో కలిసి మల్టీప్లెక్స్ బిజినెస్ కు శ్రీకారం చుట్టిన కాంప్లెక్స్ ప్రస్తుతం నిర్మాణ దశలో ఉంది.
[m9ad]
ప్రస్తుతం ఈ కాంప్లెక్స్ కు సంబంధించిన పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ‘ఏఎంబి’ (ఏషియన్ మహేష్ బాబు అయ్యుండొచ్చు) పేరుతో జరుగుతున్న ఈ కాంప్లెక్స్ హైదరాబాద్ లోని గచ్చిబౌళి ఏరియాలో జరుగుతోంది. ‘అన్ సీన్ మూవీ ఎక్స్పీరియన్స్ కమింగ్ సూన్’ అన్న పేరుతో ఉన్న హోర్డింగ్ కాంప్లెక్స్ నిర్మాణంపై ఉన్న అంచనాలను పెంచుతోంది.
ఇప్పటివరకు సినీ హీరోగా మరియు కార్పొరేట్ కంపెనీ ఉత్పత్తులకు బ్రాండ్ అంబాసిడర్ గా మాత్రమే వ్యవహరించిన మహేష్ బాబును, ఒక వ్యాపారవేత్తగా కూడా రాబోయే రోజుల్లో చూడబోతున్నామన్న మాట. ప్రిన్స్ నిర్మిస్తోన్న వ్యాపార సామ్రాజ్యం యొక్క ఫోటోలను అభిమానులు సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటూ సందడి చేస్తున్నారు.



