గడిచిన నాలుగేళ్ళల్లో మీరనుకునే ఈ సూపర్ స్టార్ కు రెండు సార్లు “శ్రీమంతుడు, భరత్ అనే నేను” సినిమాలతో లైఫ్ ఇచ్చాడంటూ… దర్శకుడు కొరటాల శివపై తన కృతజ్ఞతను అనేకసార్లు చాటుకున్న ప్రిన్స్ మహేష్ బాబు నుండి తాజాగా మరో ట్వీట్ వెలువడింది. కొరటాల శివ పుట్టినరోజును పురస్కరించుకుని శుభాకాంక్షలు తెలియజేశాడు ప్రిన్స్.
ADVERTISEMENT
“హ్యాపీ బర్త్ డే మై డియర్ ఫ్రెండ్ అండ్ డైరెక్టర్ కొరటాల శివ సర్. జీవితాంతం సంతోషం మరియు విజయం చేకూరాలని కోరుకుంటున్నాను… మీపై ఎప్పుడూ గౌరవం ఉంటుంది…” అంటూ కొరటాల గురించి మహేష్ ట్వీట్ చేయడం అనేది… తన లైఫ్ లో కొరటాలకు ఎంత ప్రాధాన్యత ఉంటుందో అనేది మహేష్ చెప్పకనే చెప్పాడు.
ADVERTISEMENT



