మీడియాకు దొరికిన మహేష్ బాబు… చెప్పేదాకా వదిలిపెట్టాలా..!

Mahesh Babu - Vaishakam Audio Launchమురుగదాస్ దర్శకత్వంలో నటిస్తోన్న సినిమాలో బిజీగా ఉంటున్న ప్రిన్స్ మహేష్ బాబు, ఇటీవల కాలంలో మీడియాకు, అభిమానులకు కాస్త దూరంగా ఉన్నారు. వరుస షూటింగ్ షెడ్యూల్స్ తో బిజీగా ఉన్న ప్రిన్స్, తాజాగా యూప్ టీవీ ఒరిజినల్స్ కార్యక్రమానికి హాజరయ్యారు. దీనికి బ్రాండ్ అంబాసిడర్ గా వహిస్తున్న మహేష్, ఈ సందర్భంగా మీడియాకు దొరికాడు. దీంతో తన తాజా సినిమా ఫస్ట్ లుక్ పై ప్రశ్నల వర్షం కురిసింది.

తొలుత ‘వెరీ సూన్’ అంటూ జవాబు చెప్పే ప్రయత్నం చేసినా, ఆ తర్వాత మాత్రం ఉగాది నాడు తన తాజా సినిమా ఫస్ట్ లుక్ విడుదల కావచ్చని స్పష్టం చేసారు. దీంతో ప్రిన్స్ అభిమానులకు పండగ లాంటి వార్తను అందించడంలో మీడియా బృందం సక్సెస్ అయ్యింది. రిలీజ్ డేట్ ను ఇప్పటికే ప్రకటించారు గానీ… టైటిల్, ఫస్ట్ లుక్, ఆడియో, ట్రైలర్ వంటి విషయాలపై మాత్రం స్పష్టత ఇవ్వలేదు. తాజా జవాబుతో ప్రిన్స్ ఫ్యాన్స్ కు కొంత ఉపశమనం లభించినట్లే!

ADVERTISEMENT

ఇక, యప్ టీవీ ఒరిజనల్స్ గురించి మాట్లాడుతూ… ఎంటర్ టైన్ మెంట్ పరిశ్రమ విస్తరిస్తోందని, ఎంత విస్తరిస్తే వ్యాపారం అంత ఎక్కువ జరుగుతుందని, అంత ఎక్కువ అవకాశాలు ఉంటాయని, ఈ అవకాశాలను ప్రతిభావంతులు అందుకుంటారని, సినీ పరిశ్రమలో ఎంతో మంది ప్రతిభావంతులు ఉన్నారని, వారందరికీ ఇలాంటి వేదికలు మంచి అవకాశాలు కల్పిస్తాయని ఆకాంక్షిస్తున్నానని ప్రిన్స్ తెలిపారు.

ADVERTISEMENT
Latest Stories