అమెరికా ప్రేక్షకుల కోసం ఈ సారి వెళ్ళాలి – మహేష్!

One should only do what they know -Mahesh Babuఓవర్సీస్ లో నెంబర్ “1” హీరో ఎవరూ అంటే… ఏ మాత్రం ఆలోచించుకోకుండా ప్రిన్స్ మహేష్ బాబు అన్న పేరు బయటకు వస్తుంది. ‘అతడు’ సినిమాతో మొదలైన విజయపరంపర మొన్నటి ‘శ్రీమంతుడు’ వరకు నిర్విరామంగా కొనసాగింది. ఏపీ, తెలంగాణాలలో ప్రిన్స్ సినిమాలకు పెట్టిన పెట్టుబడికి లాభాలు వస్తాయో రావో అన్న విషయం సినిమా విడుదల అయ్యే వరకు తెలియదేమో గానీ, ఓవర్సీస్ లో మాత్రం ఖచ్చితంగా పెట్టిన పెట్టుబడికి రెండింతలు వస్తాయని గత కొన్ని సంవత్సరాలుగా నిరూపణ అవుతూ వస్తోంది.

20వ తేదీన విడుదల కాబోతున్న “బ్రహ్మోత్సవం” సినిమా కూడా అదే బాటలో పయనిస్తుందని అభిమానులు అంతా ఆశిస్తున్నారు. మానవతా విలువలు, మనుషుల మధ్య సంబంధాలతో సినిమా అంతా ఒక ఉత్సవంలా ఉంటుందని చెప్తున్న మహేష్, యుఎస్ ప్రేక్షకులను ఈ సినిమా విపరీతంగా ఆకట్టుకుందన్న విశ్వాసాన్ని వ్యక్తపరిచారు. అలాగే ప్రతిసారి అమెరికా వెళ్లి అభిమానులను కలుసుకోవాలని అనుకున్నప్పటికీ కుదరట్లేదని, ఈ సారి వెళ్ళాలనుకుంటున్నా… అంటూ తన మనసులోని భావాన్ని బయటపెట్టారు ప్రిన్స్.

ADVERTISEMENT

బహుశా ‘బ్రహ్మోత్సవం’ సినిమా యుఎస్ ప్రేక్షకులు ‘బ్రహ్మరధం’ పడితే… ప్రిన్స్ ను తమ దగ్గరికి రప్పించుకోవడం పెద్ద కష్టమేమి కాకపోవచ్చని ప్రిన్స్ మాటల్లో వ్యక్తమవుతోంది. అనుకున్నట్లుగా ‘బ్రహ్మోత్సవం’ సినిమాకు అదిరిపోయే టాక్ వస్తే… ఈ వీకెండ్ లోనో, నెక్స్ట్ వీకెండ్ లోనో ప్రిన్స్ యుఎస్ లో ప్రత్యక్షమైనా ఆశ్చర్యపోనవసరం లేదు. లెట్స్ వెయిట్ ఫర్ ది రిలీజ్… అంటూ ఎదురుచూపులు చూడడం అభిమానుల వంతవుతోంది మరి!

ADVERTISEMENT
Latest Stories