ప్రముఖ పివిపి సంస్థ నిర్మిస్తున్న ‘బ్రహ్మోత్సవం’ సినిమా పబ్లిసిటీని ఓ రేంజ్ లో ప్లాన్ చేసినట్లుగా కనపడుతోంది. దాదాపుగా గత వారం నుండి రోజుకో పోస్టర్ చొప్పున విడుదల చేస్తూ సోషల్ మీడియాలో ‘బ్రహ్మోత్సవం’ను ఎప్పుడూ హాట్ టాపిక్ గా నిలుపుతున్న చిత్ర నిర్మాణ సంస్థ తాజాగా మరొక పోస్టర్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది.
ఆన్ లొకేషన్స్ షూటింగ్ పిక్చర్స్ లో భాగంగా హల్చల్ చేసిన వారణాసి ఫోటోలలో ఒకటైన ఫోటోను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ప్రిన్స్ మహేష్ బాబు, సమంతలు కారులో కూర్చుని ఉన్న స్టిల్ వీక్షకులను ఆకట్టుకుంటోంది. కారు డ్రైవ్ చేస్తున్న ప్రిన్స్ ను సమంత ఆశ్చర్యంగా చూస్తూ ఇచ్చిన ఎక్స్ ప్రెషన్ క్యూట్ గా కట్టిపడేస్తోంది. చిత్ర నిర్మాణ సంస్థ ఇస్తున్న ఊపుతో శనివారం నాడు జరగనున్న ఆడియో వేడుకకు ప్రిన్స్ అభిమానులు ఉత్సాహంగా సిద్ధమవుతున్నారు.
ADVERTISEMENT
ADVERTISEMENT



