“కృష్ణగాడి” తెరపై ‘మహేష్’ బొమ్మ!

mahesh photo in thank you card krishna gadi veera prema gaadhaనాచురల్ స్టార్ నాని హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ సంస్థ నిర్మించిన “కృష్ణగాడి వీరప్రేమగాధ” సినిమా విడుదలై పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. అయితే ఈ సినిమాకు అగ్ర హీరోల అభిమానులు కూడా అండగా ఉండి భారీ ఓపెనింగ్స్ కు కారణమయ్యారు.

సినిమాలో హీరో నందమూరి నటసింహం బాలకృష్ణ హీరో అని ముందుగానే ప్రచారం చేయడంతో బాలయ్య ఫ్యాన్స్ సందడి ధియేటర్ల వద్ద వెలిసిన కటౌట్ లలోనే కనపడింది. అలాగే సినిమాలో బాలయ్య పేరు పలికిన ప్రతి సందర్భంలోనూ అభిమానుల కేరింతలకు హద్దులు లేవు. అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తావన తేవడంతో పవన్ అభిమానులు కూడా సంతృప్తి చెందారు.

ADVERTISEMENT

ఇక, 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ సంస్థకు అండగా ఉన్న మహేష్ బాబు బొమ్మ కూడా వెండితెరపై పడడంతో ప్రిన్స్ ఫ్యాన్స్ సందడి కూడా మొదలైంది. “మేము మళ్ళీ కోలుకోవడానికి దోహదపడిన మన సూపర్ స్టార్ మహేష్ బాబు గారికి కృతజ్ఞతలు” అంటూ సినిమాలో వేసిన థాంక్స్ పోస్టర్ ను ప్రస్తుతం ప్రిన్స్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటున్నారు. మొత్తానికి అగ్ర హీరోల అభిమానుల హడావుడితో నాని భారీ హిట్ కొట్టడం ఖాయంగా కనపడుతోందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి.

ADVERTISEMENT
Latest Stories