డ్రగ్స్ కేసులో షైన్ టామ్ చాకో అరెస్ట్‌.. మరోసారి డేంజర్ బెల్

Malayalam Actor Shine Tom Chacko Arrest in Drugs Case

మళయాళ నటుడు షైన్ టామ్ చాకోని కేరళ పోలీసులు డ్రగ్స్ కేసులో అరెస్ట్‌ చేయడం గమనిస్తే భారతీయ సినీ పరిశ్రమలో మాదక ద్రవ్యాలు చాప కింద నీరులా పరుచుకున్నాయని స్పష్టమవుతోంది.

ఇటీవల కేరళలోని కోచ్చి పోలీసులు ఓ స్టార్ హోటల్లో మాదక ద్రవ్యాలతో పార్టీ జరుగుతోందని సమాచారం అందుకొని రైడ్ చేశారు. ఆ సమయంలో లోపలే ఉన్న షైన్ టామ్ చాకో భయపడి అక్కడి నుంచి పోలీసులకు చిక్కకుండా పారిపోయారు.

ADVERTISEMENT

అలా ఆయన భయంతో పారిపోతుంటే అక్కడే ఉన్నవారు తమ మొబైల్ ఫోన్లలో రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పెట్టడంతో వైరల్ అయ్యింది. పోలీసుల నుంచి నోటీస్ అందుకున్న ఆయన ఈరోజు కోచ్చిలో విచారణకు హాజరయ్యారు. సుమారు నాలుగు గంటల సేపు ప్రశ్నించిన తర్వాత ఈ కేసులో అరెస్ట్‌ చేశారు.

మళయాళ నటుడు షైన్ టామ్ చాకోని కేరళ పోలీసులు డ్రగ్స్ కేసులో అరెస్ట్‌ చేశారు. వైద్య పరీక్షల అనంతరం కోర్టులో హాజరు పరిస్తే రిమాండ్‌ తప్పదు. ఒకవేళ ఆయన మాదక ద్రవ్యాలు సేవించిన్నట్లు తేలితే బెయిల్‌ దొరకడం కష్టమే కానీ ఇటువంటి కేసులలో ఓ స్థాయి వరకు బాగా హడావుడి జరిగిన తర్వాత కేసులు అటకెక్కిపోతాయని తెలుగు సినీ పరిశ్రమలో మాదక ద్రవ్యాల కేసులు చెపుతున్నాయి.

మాదక ద్రవ్యాలు దేశమంతా వైరస్ వ్యాపించిన్నట్లు వ్యాపిస్తున్నాయని తరచూ నమోదవుతున్న ఇటువంటి కేసులు, పట్టుబడుతున్న గంజాయి బస్తాలు స్పష్టం చేస్తున్నాయి.

సినీ పరిశ్రమలో విపరీతమైన పోటీ, వైఫ్యల్యాలు, ఆర్ధిక సమస్యలు, అవకాశాలు కొరవడటం వంటి అనేక కారణాలు వాటి వలన కలిగే తీవ్ర ఒత్తిళ్ళ వలన మాదక ద్రవ్యాలకు అలవాటుపడేవారు కొందరైతే, కోట్ల రూపాయలు సంపాదించాము కదా జల్సాగా బ్రతకడానికి ఇటువంటివి స్టేటస్ సింబల్ అనుకుని రేవ్ పార్టీలు ఏర్పాటు చేసి మాదక ద్రవ్యాలు సేవించేవారూ ఉన్నారు.

ఇది సినీ పరిశ్రమ వరకు పరిమితమైతే పరవాలేదు. కాలేజీలు, స్కూలు పిల్లల వరకు వచ్చేస్తుండటం ఆందోళన కలిగిస్తోంది.

సినీ పరిశ్రమలో ఓ స్థాయికి ఎదగడానికి, గుర్తింపు, అవకాశాలు, పేరు ప్రతిష్టలు, డబ్బు సంపాదించుకోవడానికి అనేక మందికి ఓ జీవితకాలంలో అవకాశం లభించకపోవచ్చు. కానీ ఇటువంటి ఒక్క కేసు చాలు పాతాళంలో పడిపోవడానికి.

మాదక ద్రవ్యాలని అరికట్టడంపై చూపుతున్న శ్రద్ద కేసులని పరిష్కరించడంలో చూపకుండా మెల్లగా అటకెక్కిస్తుండటం వల్లనే సినీ పరిశ్రమలో ఈ జాడ్యం కొనసాగుతోందని చెప్పక తప్పదు.

ADVERTISEMENT
Latest Stories