అఘాయిత్యం వెనుక ఇండస్ట్రీ వ్యక్తులు… పిలుస్తారా మరి..?

Malayalam Actress Bhavana Assaultతనపై జరిగిన అఘయిత్యాన్ని ధైర్యంగా బయట ప్రపంచానికి చెప్పి, సినీ ఇండస్ట్రీలోని హీరోయిన్ల ఆలోచనలలో విప్లవాత్మకమైన మార్పులకు నాంది పలికిన హీరోయిన్ భావన వివాహ తేదీ ఫిక్స్ అయ్యింది. భావనపై జరిగిన దారుణ సంఘటన తర్వాత అనూహ్యంగా కన్నడ నిర్మాత నవీన్ తో నిశ్చితార్ధం చేసుకుని మళ్ళీ ఒక్కసారిగా వార్తల్లో నిలిచింది. అయితే తనపై జరిగిన దానికి మాత్రం న్యాయపోరాటం చేయకుండా వదలనని భావన స్పష్టం చేసింది.

అయితే నిశ్చితార్ధం అయితే జరిగింది గానీ, వివాహ తేదీని మాత్రం ప్రకటించలేదు. అయితే తాజాగా భావన తల్లి పుష్ప వెడ్డింగ్ డేట్ ను అధికారికంగా ప్రకటించారు. ప్రస్తుతం భావన స్విట్జర్లాండ్ పర్యటనలో ఉందని, రెండు కుటుంబాలు మాట్లాడుకున్న దరిమిలా, భావన – నవీన్ ల వివాహం అక్టోబర్ 27వ తేదీన నిర్వహించాలని నిర్ణయించామని పుష్ప తెలిపారు. ఈ వేడుకను తమ సొంత ఊరు త్రిచూరులో జరపనున్నామని, నిశ్చితార్ధం మాదిరే వివాహం కూడా కేవలం కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులు, బంధువుల మధ్యన జరుగుతుందని తెలిపారు.

ADVERTISEMENT

అయితే హీరోయిన్ గా భావనకు, నిర్మాతగా నవీన్… ఇద్దరూ సినీ ఇండస్ట్రీ నుండి వచ్చిన వారే కావడంతో, సినీ సెలబ్రిటీలను కూడా ఈ వివాహానికి దూరం పెడతారా? లేదా? అన్నది ఆసక్తికరంగా మారింది. ఈ విషయంలో మాత్రం వారిద్దరికే నిర్ణయాన్ని వదిలేశామని, ఇండస్ట్రీ నుండి ఎవరెవరిని ఆహ్వానించాలి? అనే విషయమై భావన, నవీన్ లే చూసుకుంటారని పుష్ప స్పష్టం చేసారు. అయితే భావన ఉదంతం వెనుక ఇండస్ట్రీ వ్యక్తులు కూడా ఉన్నారన్న ఆరోపణలు వెలువెత్తిన నేపధ్యంలో… పిలుస్తారా లేదా అన్నది వేచిచూడాలి.

ADVERTISEMENT
Latest Stories