హాలీవుడ్ సినిమాలో టాలీవుడ్ వారసురాలు!

Manchu lakshmi in basmati blues‘లాస్ వెగాస్, ఈఆర్, డెస్పరేట్ హౌస్ వైఫ్’ వంటి పలు హాలీవుడ్ సీరియల్స్ లో నటించిన మంచు మోహన్ బాబు వారసురాలు లక్ష్మీ ప్రసన్న మరొకసారి హాలీవుడ్ వెండితెరపై తళుక్కుమననుంది. ‘బాస్మతి బ్లూస్’ పేరుతో తెరకెక్కనున్న ఈ సినిమాలో నటించిన మంచు లక్ష్మి, ఇప్పటికే దీనికి సంబంధించిన షూటింగ్, డబ్బింగ్ పనులను పూర్తి చేసుకుంది.

ADVERTISEMENT

ఇండియాలోనే ఎక్కువ శాతం షూటింగ్ నిర్వహించిన ఈ సినిమా కాన్సెప్ట్ ఓ సైంటిస్ట్ చుట్టూ తిరుగుతూ ఉంటుంది. తానూ సృష్టించిన ఓ వరి వంగడాన్ని మార్కెట్ చేసుకోవడానికి ఆ సైంటిస్ట్ ఎలాంటి సమస్యలను ఎదుర్కొన్నాడు అనే అంశం ఈ చిత్ర కధ. ఆస్కార్ విజేతలు బ్రీ లారెన్స్, డోనాల్డ్ సతర్లాండ్ లు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాలో మంచు వారి వారసురాలు కూడా భాగస్వామి అయ్యి, తన గత హాలీవుడ్ అనుభవాలను గుర్తు చేసుకుంది.

ADVERTISEMENT
Latest Stories