బాలీవుడ్ హీరోయిన్ కు భర్త కష్టాలు!

Mandana Karimi files domestic violence caseబాలీవుడ్ నటిమణి, మోడల్, ‘బిగ్‌బాస్‌-9’ కంటెస్టెంట్ మందనా కరీమి (ఇరాన్) తన భర్త గౌరవ్ గుప్తాపై 498 (ఏ) క్రింద గృహహింస కేసు నమోదు చేసింది. “ఏడు వారాల కిందట మా అత్త వారి ఇంటి నుంచి నన్ను వెళ్లగొట్టారు. వారితో రాజీ చేసుకునేందుకు నేను ఎంతగానో ప్రయత్నించాను. అయినా మా అత్త వాళ్లు నన్ను తిరిగి ఇంట్లోకి రానివ్వలేదు. గౌరవ్‌ కూడా నాతో సంబంధాలు తెంపుకున్నాడు” అంటూ ఆవేదన వ్యక్తం చేసింది ఈ ముద్దుగుమ్మ.

ADVERTISEMENT

గత జనవరి 25న మందన, గౌరవ్ వివాహం జరుగగా, ఆరు నెలలు కూడా తిరక్కుండానే వారి మధ్య విభేదాలు తలెత్తాయి. వివాహానికి ముందే హిందూ మతంలోకి మారాలంటూ తనను మానసికంగా వేధించి క్షోభకు గురి చేశాడని, వివాహానంతరం మోడలింగ్, నటనకు స్వస్తి చెప్పాలని డిమాండ్ చేశాడని, అభ్యంతరమేంటని అడిగితే ఆ వృత్తి సమాజంలో తమ కుటుంబ హోదాకు భంగం కలిగిస్తుందని చెప్పాడని తెలిపింది.

తనను వేధింపులకు గురి చేసి, తన కెరీర్‌, బిజినెస్‌ కు నష్టం కలిగించినందుకు 2 కోట్ల రూపాయల పరిహారం ఇవ్వాలని, తన జీవన వ్యయానికి గాను ప్రతి నెలా పది లక్షల రూపాయలు ఇవ్వాలని అంధేరి మేజిస్ట్రేట్‌ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై స్పందించేందుకు గౌరవ్ పీఆర్ నిరాకరించారు. ‘క్యా కూల్ హై హమ్’ వంటి సినిమాల్లో హాట్ పాత్రలో మందన కనువిందు చేసిన విషయం తెలిసిందే.

ADVERTISEMENT
Latest Stories