సిల్వర్ స్క్రీన్ పై వలకబోసే అందాల విందుపై ఒక్కో బ్యూటీకి ఒక్కో ఫిలాసఫీ చెప్తుంటుంది. తాజాగా ఆ జాబితాలోనే చైతూ బ్యూటీ మంజిమ మోహన్ తన అభిప్రాయాలను కుండబద్దలు కొట్టినట్లు చెప్పింది. గ్లామర్ కు, అశ్లీలానికి సన్నని తెర ఉందని, అది సరిగ్గా అర్ధం చేసుకుంటేనే సినీ ప్రపంచంలో తమపై ఓ అభిప్రాయం ఏర్పడుతుందని ముందుగా ఇండస్ట్రీ గురించి చెప్పుకొచ్చింది. ఇక తాను ఇటీవల ఒకటి చెబితే, మీడియాలో అది మరొకలాగా వచ్చిందని చెప్పిన మంజిమ, ప్రేక్షకుల అభిరుచుల్లో కూడా చాలా తేడా వచ్చిందని, గ్లామర్ కు, అశ్లీలానికి మధ్య తేడాను గుర్తిస్తారని చెప్పింది.
“సాహసం శ్వాసగా సాగిపో” సినిమాలో నాగచైతన్య సరసన నటించిన మంజిమ మోహన్… గ్లామర్ పేరుతో చిట్టిపొట్టి డ్రెస్సులు వేసుకోవడాన్ని తీవ్రంగా వ్యతిరేకించే తాను, లిప్ లాక్ ను ఎలా అంగీకరిస్తానని, సినిమా అవకాశాలు లేకపోతే ఇంట్లో కూర్చుంటానే తప్ప కుటుంబం మొత్తం చూడలేని సినిమాలు చేయలేనని తెగేసి చేసింది. అలా అని తాను గ్లామర్ పాత్రలను చేయనని చెప్పడం లేదని, గ్లామర్ వేరు, అశ్లీలం వేరని చెప్పడమే తన ఉద్దేశంగా తెలిపింది. అయితే ఉన్నట్లుండి ఇదంతా ఎందుకు చెప్పుకొచ్చింది అంటే… ‘లిప్ లాక్ లకు సై అన్న మంజిమ’ అంటూ మీడియా వర్గాలలో రావడంతో వివరణ ఇచ్చుకుంది ఈ బ్యూటీ.



