అడుసు తోక్కనేలా… కాలు కడగనేలా…?

Manoj-Prabakar-Mahesh-Babu-Controversyసరదాగా అయినా… ఉద్దేశపూర్వకంగా అయినా… సూపర్ స్టార్స్ పై వ్యాఖ్యలు చేసేటపుడు చాలా జాగ్రత్తలు వహించాలన్న విషయం మనోజ్ ప్రభాకర్ అనే వ్యక్తికి చాలా ఆలస్యంగా తెలిసినట్లుంది. నోటికి అడ్డు, అదుపు లేకుండా టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబుపై చేసిన వ్యాఖ్యల పర్యవసానం ఏమిటో ప్రస్తుతం రుచిచూస్తున్నాడు మనోజ్.

[m9ad]

ADVERTISEMENT

మనోజ్ చేసిన వెకిలి చేష్టలకు తీవ్రస్థాయిలో ప్రిన్స్ అభిమానగణం స్పందించడంతో… వెనక్కి తగ్గిన మనోజ్, చివరికి క్షమాపణలు కోరారు. అయితే అందులో కూడా ఒక రకంగా తన అహంకారాన్ని చాటుకోవడంతో, ప్రిన్స్ అభిమానులు ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేలా కనపడడం లేదు. ఎందుకంటే సెప్టెంబర్ 15వ తేదీన మనోజ్ పాల్గొనబోయే ఓ షోకు సంబంధించిన డీటెయిల్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

చెన్నైలోని హరిశ్రీ విద్యాలయంలో ఈ శనివారం నాడు రాత్రి 7 గంటలకు మనోజ్ ప్రభాకర్ షో జరగనుంది. ఈ షోకు వెళ్లి నిరసన తెలిపేందుకు ప్రిన్స్ అభిమానగణం సమాయత్తమవుతున్నట్లుగా కనపడుతోంది. వాక్ స్వేఛ్చ ఉంది కదా అని… ఇష్టమొచ్చినట్లు మాట్లాడడం… దాని నుండి కామెడీ పండించాలనుకోవాలనుకుంటే సాధ్యం కాదని మనోజ్ గుర్తించాలి.

ADVERTISEMENT
Latest Stories