మూడు గంటల “మను” టాక్!

manu-movie-public-talkవిడుదల చేసిన టీజర్, ట్రైలర్లు ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉండడంతో “మను” సినిమాపై ప్రేక్షకులలో ఒక రకమైన అంచనాలు నెలకొన్నాయి. ముఖ్యంగా ఇది టాలీవుడ్ లో ఓ సరికొత్త ప్రయత్నంగా ఇండస్ట్రీ వర్గాలు కొనియాడగా, మరి ఆ ప్రయత్నం ప్రస్తుతం సిల్వర్ స్క్రీన్ పైకి వచ్చింది. “మను”ను వీక్షించిన సినీ అభిమానుల స్పందన కమర్షియల్ గా చిత్ర యూనిట్ కు ఆశాజనకంగా లేకపోవడం గమనించదగ్గ అంశం.

[m9ad]

ADVERTISEMENT

ముఖ్యంగా మూడు గంటల పాటు సాగిన “మను” జర్నీ ప్రేక్షకుల సహనాన్ని పరీక్షించే ప్రధాన కారణంగా కనపడుతోంది. రిలీజ్ కు ముందు అనుకున్న విధంగానే థ్రిల్లర్ మూవీస్ కు షార్ట్ రన్ అనేది ప్రధాన ప్లస్ పాయింట్. కానీ “మను”లో లోపించింది అదే. లవ్ అండ్ రివేంజ్ స్టోరీని దర్శకుడు తెరపై చూపించిన విధానం సరికొత్తగా ఉన్న మాట వాస్తవమే గానీ, అది ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లుగా లేదన్న టాక్ వినపడుతోంది.

అయితే చిన్న సినిమా అయిన ఈ “మను” సాంకేతికంగా చాలా పెద్ద సినిమాగా చెప్పుకోవచ్చు. హాలీవుడ్ స్థాయిలో విశ్వనాధ్ రెడ్డి అందించిన సినిమాటోగ్రఫీ మరియు నరేష్ కుమరన్ అందించిన నేపధ్య సంగీతం ప్రేక్షకుల మనసులను కొల్లగొట్టింది. అలాగే ప్రధాన పాత్రలలో నటించిన గౌతమ్, చాందిని చౌదరిలకు కెరీర్ బెస్ట్ రోల్స్ దక్కాయి, వారు కూడా అలానే ప్రతిభను చాటుకున్నారు. మూడు నుండి రెండు గంటలకు ‘మను’ను కుదిస్తే, బహుశా ప్రేక్షకుల చేత ‘పాస్’ మార్కులైనా వేయించుకునేదేమో!?

ADVERTISEMENT
Latest Stories