పెళ్ళితో ఇల్లు… టాటూతో గిన్నిస్ రికార్డ్! ఏది బెటర్?

Debate between choosing a meaningful marriage life or risking health for a tattoo Guinness record

ఒకరి ఆలోచన, సాహసం గొప్ప పేరు ప్రతిష్టలు తెచ్చిపెట్టొచ్చు లేదా జీవితాలను నాశనం చేసేయవచ్చు. కానీ ఈ రెండు భిన్నమైన ఆలోచనల గురించి వింటే మొదటిది అందరూ మెచ్చుకుంటారు. రెండోది అందరూ విమర్శిస్తారు. అవేమిటో చూద్దాం.

ఇటీవల ఓ ఉత్తరాది రాష్ట్రంలో ఓ జంట పెళ్ళి చేసుకుంది. ఆ వీడియో వైరల్ అయ్యింది. ఇటీవల విశాఖలో ఓ యువకుడు టాటూలు వేసుకున్నాడు. వార్తలకెక్కాడు. గిన్నిస్ రికార్డ్ కూడా పొందాడు. పెళ్ళి చేసుకోవడం, టాటూ వేసుకోవడం గొప్ప విషయాలేనా?అంటే అవుననే అంటారు ఈ రెండూ చదివితే!

ADVERTISEMENT

పెళ్ళి స్టోరీ: ఈరోజుల్లో కనీసం పెళ్ళి ఖర్చులు రూ.30-50 లక్షలుపైమాటే. ఆ తర్వాత నూతన దంపతులు ఓ కారు, సొంత ఇల్లు వంటివి అమర్చుకోవడానికి వారి జీవితాలను ఈఎంఐల రూపంలో బ్యాంకులకు తాకట్టు పెడుతుంటారు.

కానీ ఓ ఉత్తరాది రాష్ట్రంలో ఓ యువకుడు పెళ్ళి ఖర్చులతో కొత్త ఇల్లు కోనేసుకొని దాంట్లోనే పెళ్ళి చేసుకున్నాడు. ఆడంబరాల కోసం లక్షల రూపాయలు తగలేయడం కంటే ఆ డబ్బుతో ఓ ఇల్లు కొనుక్కుంటే తాము హాయిగా ఆ ఇంట్లో జీవించగలమని పెళ్ళి కొడుకు అందరికీ నచ్చజెప్పాడు.

వారు ఒకే అనడంతో పెళ్ళి ఖర్చులకి అనుకున్న డబ్బుతో ఓ కొత్త ఇల్లు కొనుకొని, ఆ కొత్త ఇంట్లోనే ఇరు కుటుంబాల సమక్షంలో నిరాడంబరంగా పెళ్ళి చేసుకున్నారు. సోషల్ మీడియాలో వారి పెళ్ళి వీడియో వైరల్ అవుతోంది.

టాటూ స్టోరీ: జగదీష్ అనే ఓ యువకుడు విశాఖలో టాటూ డిజైనర్‌గా చేస్తున్నాడు. గిన్నిస్ బుక్ రికార్డు కోసం అతను తన రెండు కళ్ళపై టాటూలు వేయించుకున్నాడు! వాటితో అతని చూపు పోయిందంటూ వార్తలు వచ్చాయి. అతను స్పందిస్తూ “టాటూలతో నా కంటి చూపు పోలేదు. కళ్ళ పరీక్ష కూడా చేయించుకున్నాను. ఎలాంటి సమస్య లేదని కంటి వైద్యులు చెప్పారు,” అని చెప్పాడు.

పెళ్ళితో జీవితం సెట్ చేసుకోవడం, గిన్నిస్ రికార్డ్ కోసం టాటూతో కళ్ళు పోగొట్టుకునే సాహసం చేయడం ఏది కరెక్ట్?

 

View this post on Instagram

 

A post shared by Shreeom Kumar (@iasworldofficial)

ADVERTISEMENT
Latest Stories