విజయాలపై ‘నాచురల్ స్టార్’ నాని చేస్తోన్న ‘దండయాత్ర’ ఇప్పట్లో ఆగేలా లేదు. సక్సెస్ పై సక్సెస్ కొడుతూ ఇతర హీరోల నుండి దూరంగా జరుగుతోన్న నాని ఖాతాలో మరో సక్సెస్ ఫుల్ బొమ్మ పడినట్లే అన్న పాజిటివ్ సంకేతాలను ఫస్ట్ లుక్ లోనే “మిడిల్ క్లాస్ అబ్బాయ్’ ఇచ్చేసింది. నాని యాక్టింగ్ కు తోడు దేవిశ్రీ ప్రసాద్ జోష్ ఫుల్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఈ ఫస్ట్ టీజర్ కు మరో ప్రధాన హైలైట్.
ఇక ‘ఫిదా’ సినిమాతో తెలుగు ప్రేక్షకుల మనసులలో సుస్థిర స్థానం సంపాదించుకున్న సాయిపల్లవి, ఈ “ఎంసీఏ’ బొమ్మకున్న హైలైట్స్ లో మరొకటిలా కనపడుతోంది. ఫస్ట్ లుక్ లో అమ్మాయిలను చూసి అబ్బాయిలు పడిపోవడం రొటీన్ అయితే… ఈ టీజర్ లో మాత్రం నానిని చూసి సాయిపల్లవి ఫ్లాట్ అయ్యి ఫ్లవర్ ఇవ్వడం డిఫరెంట్. మరి సినిమా కూడా ఇంతే డిఫరెంట్ గా ఉంటుందేమో చూడాలి.
‘ఓ మై ఫ్రెండ్’ ఫేం వేణు శ్రీరాం దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను దిల్ రాజు ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ ఏడాది జనవరిలో నాని – దిల్ రాజులు కలిసి “నేను లోకల్” సినిమాతో బంపర్ హిట్ కొట్టగా, అదే రేంజ్ సక్సెస్ ను డిసెంబర్ లో “మిడిల్ క్లాస్ అబ్బాయ్”తో ముగిస్తారేమో చూడాలి. మొత్తానికి నాని విజయాల యాత్ర అయితే నిర్విరామంగా సాగేలా కనపడుతోంది.


