‘మెగాస్టార్’కి దర్శకులు కావాలట…!

Megastar - chiranjeeviమెగాస్టార్ ఇప్పుడు ఫుల్ ఖుషీగా ఉన్నాడు. ఎందుకంటారా ఒకరా ఇద్దరా..వరుసగా ఆయన శిబిరం నుంచి హీరోలు వస్తూనే ఉన్నారు కదా. పైగా వాళ్లంతా హిట్ హీరోలుగా మారడంతో ఆ ఫీల్ ను ఎంజాయ్ చేస్తున్నారు.

ఇదిలా ఉంటే ఇప్పుడు మెగాస్టార్ కి దర్శకులు కావాలట. అదేంటి మెగాస్టార్ కి దర్శకులు కరువు ఏంటి? ఆయన సినిమా తీస్తాను అనాలే కానీ, ఎదురొచ్చి ఫ్రీగా చేస్తాను అనేవారు ఉన్నారు. అలాంటిది ఆయనకు దర్శకులు అవసరం ఏంటి అంటారా..అక్కడే ఉంది లాజిక్.

ADVERTISEMENT

దర్శకులు ఆయనకు కాదు, ఆయన అల్లుడు కళ్యాణ్ దేవ్ కి. ఇప్పటివరకూ మెగాస్టార్ కుటుంభం నుంచి అరడజను పైగా హీరోలు వచ్చారు.మరో పక్క ఎవరికీ వాళ్ళు వాళ్ళ రేంజ్ కి తగ్గట్లు దూసుకుపోతున్నారు. అయితే అందరూ యాక్టింగ్ ని ఎంచుకోవడం చిరు కి మంచి ఆనందాన్ని ఇస్తున్న అంశం.

అదే క్రమంలో తన అల్లుడు కళ్యాణ్ దేవ్ కూడా యాక్టింగ్ నే ఇష్టపడటం..ఆ దారిలోనే నడవడం సంతోషాన్ని ఇచ్చింది అని, తన అల్లుళ్ళ కోసం మెగాస్టార్ ఇప్పుడు మంచి టేస్ట్ ఉన్న దర్శకుల కోసం వెతుకుతున్నారు అని తెలుస్తుంది.

మొత్తంగా చూసుకుంటే మాత్రం ఇప్పుడు మెగాస్టార్ నుంచి మంచి ఆఫర్ ఉంది…ఉపయోగించుకున్న వాళ్లకి ఉపయోగించుకున్నంత అన్న మాట. మరి ఈ ఆఫర్ ఎవరిని ఎలా వరిస్తుందో చూద్దాం.

ADVERTISEMENT
Latest Stories