మళ్ళీ ‘మెహ్రీన్’కి అతడే దిక్కయ్యాడుగా!

Mehrene Kaur Pirzada gets another hit anil ravipudiకృష్ణ గాడి వీర ప్రేమ గాథ మొదలుకొని మహానుభావుడు, రాజా ది గ్రేట్ సినిమాలతో మంచి హిట్స్ అందుకుంది అందాల భామ మెహ్రీన్. అయితే కధ అంతవరకూ బాగానే ఉంది కానీ, ఆ తర్వాత వచ్చిన సినిమాలు వరుసగా ప్లాప్స్ అవుతూ ఉండడంతో ఆమె కెరీర్ ఇబ్బందుల్లో పడింది.

మంచి హిట్ కోసం, బ్రేక్ కోసం ఎదురు చూస్తున్న మెహ్రీన్ కి మరోసారి దిక్కు అయ్యాడు దర్శకుడు అనిల్ రావిపూడి. రాజా ది గ్రేట్ సినిమాతో ఆమెకు మంచి హిట్ ఇచ్చిన అనిల్. మరోసారి ఎఫ్-2 తో మరో హిట్ ను ఆమె ఖాతాలో వేసాడు. నిన్ననే ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఎఫ్-2 మంచి హిట్ టాక్ తో దూసుకుపోతుంది.

ADVERTISEMENT

అయితే ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్ టాగ్ లైన్ గా వచ్చిన ఈ సినిమా తొలి భాగం ఆద్యతం అలరించినప్పటికీ, మరి భాగం మాత్రం కాస్త ఇబ్బంది పెట్టింది అనే చెప్పవచ్చు. ఇక ఈ సినిమాలో తమన్నాతో పాటు నటించిన మెహ్రీన్, కొన్ని సీన్స్ లో తమన్నాతో పోటీ పడి మరీ నటించి మెప్పించింది. మరి మంచి బ్రేక్ కోసం ఎదురు చూస్తున్న ఆమెకు ఈ సినిమాతో అనుకున్న హిట్ లభించినట్లే అని స్పష్టంగా చెప్పవచ్చు.

ADVERTISEMENT
Latest Stories