ఏంటి మణి… ఇలా కొట్టావ్..!

LIE Miss Sunshine Song Could This Be Big Comeback For Mani Sharma‘కృష్ణగాడి వీరప్రేమగాధ’ ఫేం హను రాఘవపూడి దర్శకత్వంలో నితిన్ హీరోగా నటిస్తున్న “లై” సినిమాలో మొదటి పాట ఎంత హిట్ అయ్యిందో తెలిసిందే. ఇటీవల మళ్ళీ వరుసగా సినిమాలు చేస్తున్న మణిశర్మ, ‘బ్యాక్ విత్ ఎ బ్యాంగ్’ అన్న రీతిలో సందడి చేసిన ఈ పాటకు కొనసాగింపుగా విడుదలైన ‘లై’ ఆల్బమ్ లోని రెండవ పాట, ‘మిస్ సన్ షైన్’ సంగీత ప్రియులను పూర్తిగా నిరుత్సాహ పరచడంలో విజయవంతమైంది.

కృష్ణకాంత్ సాహిత్యం అందించిన ఈ పాటను అనురాగ్ కులకర్ణి, సింధూరిలు ఆలపించారు. ఏదో పదాలను వరుసగా పాడుతున్నట్లుగా ఉంది గానీ, ఓ బీట్ గానీ, ఓ ఊపు గానీ లేకుండా మణి స్వరపరచడం విశేషం. లిరికల్ వీడియోతో కూడిన ఈ పాటను చిత్రీకరించిన లొకేషన్స్ హైలైట్ గా కనపడుతున్నాయి. ఈ పాట విన్న మణిశర్మ అభిమానులు మాత్రం… ‘ఏంటి మణి ఇలా కొట్టావ్…’ అనుకోవడం మాత్రం సహజం. బహుశా ఆల్బమ్ లో వీకెస్ట్ సాంగ్ ఇదేనేమో..!

ADVERTISEMENT

ADVERTISEMENT
Latest Stories