లైవ్ లో తనపై జరిగిన ‘రేప్’ గురించి చెప్పింది!

Miss World Finalist Adau Mornyang reveals she was raped మిస్ వరల్డ్ ఫైనలిస్ట్, ఆస్ట్రేలియా ‘బ్లాక్ బ్యూటీ’ అడావు మార్న్ యాంగ్ ఫేస్ బుక్ లైవ్ లో అభిమానులతో ముచ్చటిస్తూ భావోద్వేగానికి గురైంది. తన టీనేజ్ వయసులో అత్యాచారానికి గురయ్యాననే సంచలన విషయాన్ని వెల్లడించింది. దాదాపు గంట పాటు తన అభిమానులతో మాట్లాడుతూ… తానెదుర్కొన్న భయానక ఘటనల గురించి పూస గుచ్చినట్టు చెప్పగా, ఇప్పుడా వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది.

ADVERTISEMENT

అడిలైడ్ లో తనకు తెలిసిన వ్యక్తే లైంగికంగా వేధించాడని, అప్పుడు ఎవరికీ చెప్పుకోలేక తనలో తానే కుమిలిపోయానని చెప్పింది. ఆ సంఘటనను తలచుకుంటూ లైవ్ లోనే కన్నీరు పెడుతూ, ఇప్పుడు బహిరంగంగా మాట్లాడటానికి తానేమీ భయపడటం లేదని చెప్పింది. సౌత్ సూడాన్ లో పుట్టి, ఆస్ట్రేలియాలో పెరిగిన ఈ 22 ఏళ్ల బ్యూటీ క్వీన్, ఇకపై అమ్మాయిల రక్షణకు తన వంతు పాత్రను పోషిస్తానని తెలిపింది.

ADVERTISEMENT
Latest Stories