ఈ ట్రైలర్ చూడమంటోన్న రేణుదేశాయ్!

MITTI-back to roots Trailerదేశంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలే ప్రధాన ఇతివృత్తంగా తీసుకుని తెరకెక్కించిన ‘మిట్టీ’ చిత్రం ట్రైలర్ ను చూడాలని పవర్ స్టార్ మాజీ సతీమణి రేణూ దేశాయ్ కోరారు. ఈ మేరకు తన ఫేస్ బుక్ ఖాతాలో ఓ పోస్టును పెట్టిన ఆమె, “మనకు జీవనాధారం రైతులే. దేశంలో రైతుల మేరుకోరే కొందరు నిర్మించిన చిత్రం ట్రయిలర్ లింక్ ను నేను పంచుకుంటున్నాను. దీన్ని చూడండి” అని వ్యాఖ్యానించింది.

[m9ad]

ADVERTISEMENT

దేశంలో జరుగుతున్న రైతుల ఆత్మహత్యలు, పంటలు పండక, తీసుకున్న అప్పులు తిరిగి ఎలా చెల్లించాలో తెలియక మధనపడే రైతన్నల కుటుంబాలు, ఒక సీజన్ లో మంచి ధర వచ్చిందని, అప్పు చేసి డబ్బు తెచ్చి, పత్తి పంటను వేసి, వర్షాలు కురవక పంట నష్టపోతున్న రైతన్నల వ్యధలను ఈ ట్రయిలర్ లో ప్రస్తావించారు. ఈ ట్రైలర్ చూసిన తర్వాత రేణు భావాలతో నెటిజన్లు కూడా ఏకీభవిస్తున్నారు.

ADVERTISEMENT
Latest Stories