మనదాకా వచ్చేవరకు నొప్పి తెలియదా రోజా గారూ!

MLA Roja comments on Dachepalli Rape controversyచంద్రబాబు తన ప్రచారం కోసం దాచేపల్లి మానభంగం ఘటనలో బాదితురాలి తండ్రిని తన పక్కన కూర్యోబెట్టుకుని మాట్లాడడం శోచనీయమని వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే రోజా అన్నారు. చంద్రబాబు ఇలాంటి ఘటనలను కూడా రాజకీయం చేస్తూ, ప్రజల జీవితాలతో చెలగాటమాడుతూ , తన వైఫల్యాన్ని వైఎస్ ఆర్ కాంగ్రెస్ పై రుద్దడానికి ప్రయత్నిస్తున్నారని ఆమె అన్నారు.

ADVERTISEMENT

అసలు మొదట రాజకీయం మొదలు పెట్టింది ఎవరు? రేప్ ని ఖండిస్తూ రాష్ట్రంలో జరుగుతున్న ఎక్కువ భాగం అత్యాచారాలు టీడీపీ వాళ్ళే చేస్తున్నారని ట్విట్టర్ లో అభియోగించింది సాక్షత్తు జగన్ మోహన్ రెడ్డి కాదా? నిందితుడు టీడీపీలో కార్యకర్త అని చెప్పే ప్రయత్నం వైకాపా వారు చెయ్యలేదా?

బాధితురాలు ఉన్న హాస్పిటల్ ముందు స్వయంగా రోడ్డు మీద కూర్చుని ధర్నా చేసి రాజకీయ లబ్ది కోసం ప్రయత్నించింది స్వయంగా రోజానే కదా? కాకపోతే స్వయంగా బాధిత కుటుంబమే బయటకు వచ్చి తాము వైఎస్సాఆర్ కాంగ్రెస్ వారిమి అని చెబుతుందంటతో వైకాపా వారికి నోట్లో పచ్చి వెలగపండు పడినట్టు అయ్యింది. మనదాకా వచ్చేవరకు నొప్పి తెలియదా రోజా గారూ!

ADVERTISEMENT
Latest Stories