టీమిండియా పేసర్ మొహమ్మద్ షమీపై సంచలన ఆరోపణలు చేసి, పలు కేసులు పెట్టిన సతీమణి హసీన్ జహాన్ బాలీవుడ్ లో అడుగుపెట్టబోతోంది. ఐపీఎల్ చీర్ గర్ల్ అయిన హసీన్, మాజీ మోడల్ కూడా! అంజాద్ ఖాన్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ‘ఫత్వా’ సినిమాలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అక్టోబర్ లో సెట్స్ పైకి వెళ్లనున్న ఈ చిత్రంలో ఓ జర్నలిస్టు పాత్రలో హసీన్ కనిపించబోతోంది.
తన కూతురుని పోషించడానికి కొంత సంపాదించాలన్న ఉద్దేశంతోనే సినిమాల్లో నటించాలనుకుంటున్నానని, ఈ కారణంగా అంజాద్ ఖాన్ ను కలిసి… సినిమా చేయడానికి ఒప్పుకున్నానని చెప్పారు. మరోవైపు షమీ నుంచి న్యాయబద్ధంగా తనకు రావాల్సిన భరణం గురించి పోరాడతానని తెలిపింది. ఈ చిత్రం కోసం ఓ ఫోటోషూట్ కూడా నిర్వహించగా, దానిని కొద్ది రోజుల క్రితం తన సోషల్ మీడియా ఖాతాలో కూడా పోస్ట్ చేసింది హసీన్.
ADVERTISEMENT
ADVERTISEMENT



