భగవంతుడు కనపడి కోరుకోమంటే… ఈ హీరో గారు…!

Mohan babu about moviesతన ముక్కుసూటితత్వంతో లేనిపోని తలనొప్పులు తెచ్చుకుంటారనే టాక్ మంచు మోహన్ బాబుపై ఉంది. ఒక్కోసారి మోహన్ బాబు వ్యాఖ్యలను పరిశీలిస్తే ఇది నిజమనిపించక మానదు. అలాంటి మోహన్ బాబును తన పుట్టినరోజు పురస్కరించుకుని దేవుడు కనపడి వరమిస్తానంటే ఏం కోరుకుంటావ్… అని అడిగితే మంచు మోహన్ బాబు గారు ఏం చెప్పారో తెలుసా…

“భగవంతుడా! కలలో కూడా ఊహించని మంచి జీవితాన్ని ఇచ్చావు. కష్టాన్నే నమ్ముకున్న… దానికి ప్రతిఫలం ఇచ్చావ్’ అని ముందుగా కృతజ్ఞతలు తెలియజేస్తాను. ఆ తర్వాత దేశంలో పెరిగిపోయిన పేదరికాన్ని నిర్మూలించమని కోరుకుంటాను. ‘సమాజంలో అక్రమాలు పెరిగిపోతున్నాపెరిగిపోతున్నాయి… వాటిని రూపుమాపు తండ్రీ! పేదలను పేదలుగానే మిగిల్చేయకు… మా అందరికీ ఓ మంచి దారి చూపించినట్లే వాళ్లకీ ఓ దారి చూపించు” అని కోరుకుంటానని మోహన్ బాబు బదులిచ్చారు.

ADVERTISEMENT

ఒకప్పుడు తన సమకాలీకులైన రజనీకాంత్, చిరంజీవి, అలాగే తమ్ముడు పవన్ కళ్యాణ్ లతో నటించే అవకాశం లేదని, అయితే అలా నటించాలన్న అభిలాష అయితే తనలో ఉందని మోహన్ బాబు చెప్పుకొచ్చారు. ఇటీవల నటించిన ‘మామ మంచు – అల్లుడు కంచు’ సినిమా ఎందుకు చేసానా అనిపించిందని… సినిమా చూసిన తర్వాత పూర్తి సంతృప్తిని ఇవ్వలేదని అభిప్రాయపడ్డ కలెక్షన్ కింగ్, తన పుట్టినరోజు వేడుకలు ఎప్పటిలాగానే, శ్రీవిద్యానికేతన్ విద్యార్దుల మధ్య జరగబోతోందని తెలిపారు.

ADVERTISEMENT
Latest Stories