సంచలన పాత్రలో మోహన్ బాబు?

Mohan babu - Rajinikanth Next Movieవిలక్షణ నటుడిగా ఇప్పటివరకు పాత్రలు పోషించిన లెజండరీ ఆర్టిస్ట్ ‘కలెక్షన్ కింగ్’ మోహన్ బాబు మరో సంచలనమైన పాత్రలో నటించబోతున్నారా? అది కూడా ఆ సంచలన పాత్రను చేయమని ‘సూపర్ స్టార్’ రజనీకాంత్ సలహా ఇచ్చారా? అంటే అవుననే అంటున్నాయి ట్రేడ్ వర్గాలు. సినీ పరిశ్రమలో రజనీకాంత్ – మోహన్ బాబుల మధ్య ఉన్న అనుబంధం ప్రత్యేకమైనదన్న విషయం బహిరంగ సత్యమే. వీరిద్దరి మధ్య విడదీయలేని స్నేహం ‘ఏరా అంటే ఏరా’ అనుకునేది.

దీంతో రజనీ ఏ సలహా ఇచ్చినా మోహన్ బాబు తూచ తప్పకుండా పాటిస్తారు. అందులో భాగంగానే గతంలో ‘అల్లరి మొగుడు, పెదరాయుడు’ వంటి సూపర్ హిట్ చిత్రాలు మోహన్ బాబు ఖాతాలో వచ్చి చేరాయి. తాజాగా రజనీ అల్లుడు ధనుష్ దర్శకత్వం వహించిన ‘పవర్ పాండి’ అనే సినిమాను రజనీ కోసం ప్రత్యేకంగా చూపించగా… సినిమా మొత్తాన్ని చూసిన తర్వాత తన అల్లుడిని రజనీ ప్రశంసల్లో ముంచెత్తారు రజనీ. ఈ సినిమా అనేక సంవత్సరాల వరకు నీ పేరు నిలబెడుతుందని చెప్పి… మరో పదేళ్ల వరకు మరో సినిమాకు దర్శకత్వం వహించవద్దని సూచించారట.

ADVERTISEMENT

అలాగే తన మిత్రుడు మోహన్ బాబును కూడా ఈ ‘పవర్ పాండి’ సినిమా ప్రదర్శనకు పిలిచారని… ఈ సినిమాను తెలుగులో రీమేక్ చేసి, అందులో నటించమంటూ తన మిత్రుడు మోహన్ బాబుకు సూచించారని సమాచారం. అయితే తన స్నేహితుడు సూచనలకు మోహన్ బాబు ఎలాంటి సమాచారం చెప్పారన్నది ఆసక్తికరంగా మారింది. తమిళంలో రాజ్ కిరణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కించిన ఈ సినిమాలో 60 ఏళ్ల ఓ వృద్ధుడు తన జీవితంలో ఏం కోరుకుంటాడు? అనేది ప్రధాన కథాంశం. దీనిని తెలుగులో మోహన్ బాబు చేస్తారా? లేదా? అనే విషయం తెలియాలంటే కొంత కాలం వేచి చూడాలి.

ADVERTISEMENT
Latest Stories