ప్రస్తుతం అటు సామాజికంగా ఇటు రాజకీయంగా నేటి భారతం జెన్ జీ ల జపం చేస్తుంది. ఒక్క ఉద్యమం భారతదేశ రాజకీయ ముఖ చిత్రాన్ని పూర్తిగా జెన్ జీ ల వైపు ఆకర్షించేలా చేసింది అని చెప్పడం లో అతిశయోక్తి లేదేమో బహుశా..!
కేంద్రంలో తిరిగులేని రాజకీయ ఆధిపత్యం చెలాయిస్తున్న బీజేపీ నుంచి దాని అనుబంధం సంస్థ గా చెప్పుకునే RSS వరకు అందరు జెన్ జీ ల కేంద్రంగానే తమ ప్రకటనలు, ప్రసంగాలు సాగేలా చూసుకుంటున్నారు. ఇక ఇటు రాష్ట్ర రాజకీయాలలో కూడా అటు వైసీపీ ఇటు బిఆర్ఎస్ జెన్ జీల ట్రెండ్ ఫాలో అయ్యేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నాయి.
దేశ ప్రధాని నరేంద్ర మోడీ సైతం జెన్ జీ లను తన వైపు ఆకర్శించుకునేందుకు కాను సోషల్ మీడియా సెల్ఫీ వీడియోల ద్వారా ‘హాయ్ ఫ్రెండ్స్’ అంటూ జన్ జీ ల భాషతో ప్రజల ముందుకొస్తున్నారు, తన అభిప్రాయాలను పంచుకుంటున్నారు. ఇక RSS కూడా ప్రస్తుతం అదే ట్రెండ్ ఫాలో అవుతునట్టు కనిపిస్తుంది.
దేశంలో తమ సమస్యల పరిష్కారం కోసం నిరసనలు చేసే జీన్ జీ లు దేశ ద్రోహులు కారని, వారే భారతదేశ భవిత అంటూ RSS చీఫ్ మోహన్ దాస్ భాగవత్ పేర్కొన్నారు. సమాజంలో ప్రస్తుతం తరం కంటే కూడా జెన్ జీలు, ఆల్ఫా లు మరింత నిజాయితీ గల పౌరులుగా తానూ భావిస్తున్నట్టు వారి పై ప్రసంసలు గుప్పించారు.
ముంబై లో జరిగిన ఓ కార్యక్రమలో పాల్గొన్న మోహన్ దాస్ ప్రస్తుతం దేశంలో కొనసాగుతున్న జన్ జీ ల ట్రెండ్ ను ఉద్దేశించి చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు RSS తో పాటుగా బీజేపీ లోను హాట్ టాపిక్ గా మారాయి. జెన్ జీలు పెద్దలను ప్రశ్నించని నాటి తరం వారిలా కాకుండా తమ సమస్యలకు, ప్రశ్నలకు ప్రభుత్వాల నుంచి లాజికల్ ఆన్సర్ లను కోరుకుంటున్నారని కొనియాడారు.
ప్రభుత్వాలతో పాటుగా అందరూ కూడా వారికీ తగిన ప్రాధాన్యం ఇస్తూ వారితో కలిసి ముందుకెళ్లాలని ఆకాంక్షించారు మోహన్ దాస్ భాగవత్. RSS భావజాలం తో పుట్టుకొచ్చిన బీజేపీ మెడలు వంచిన జన్ జీ ల ఉద్యమ ప్రభావం RSS ముందుగానే గ్రహించడమే కాకూండా అందుకు అనుగుణంగా బీజేపీ పెద్దలు కూడా తమ విధానాలను మార్చుకోవాలంటూ మోహన్ దాస్ పరోక్ష సంకేతాలు సైతం అందిస్తున్నారా అన్నట్టుగా ఆయన ప్రసంగం సాగింది.




