ఈ ట్రైలర్ వలన ఉపయోగం ఉంటుందా?

Mohini Trailerవాయిదాలు పడుతూ వస్తోన్న సినిమాపై ఆసక్తి తగ్గిపోవడం సహజమే. అలాంటి ఇబ్బందులనే చెన్నై బ్యూటీ త్రిష “మోహిని” సినిమా ఎదుర్కొంది. ఎప్పుడో రిలీజ్ కావాల్సిన ఈ సినిమాను ఈ నెల 27వ తేదీన తమిళంతో పాటు తెలుగులో కూడా విడుదల చేయబోతున్నారు. దీంతో ఇంతకుముందు తమిళంలో రిలీజ్ చేసిన ట్రైలర్ ను తెలుగులోకి డబ్ చేసి తాజాగా విడుదల చేసింది చిత్ర యూనిట్.

ADVERTISEMENT

‘ఎన్నో వేల సంవత్సరాలుగా పూడ్చి పెట్టబడిన నిజం’ అంటూ ప్రారంభమైన ఈ ట్రైలర్ భయపెట్టాలని తీవ్ర ప్రయత్నమే చేసినప్పటికీ, అందులో సక్సెస్ కాలేకపోయింది. గ్రాండ్ ప్రొడక్షన్ వాల్యూస్ మినహా ఈ ట్రైలర్ గురించి పెద్దగా చెప్పుకోవడానికి ఏం లేదు. విడుదలకు 10 రోజుల ముందుగా రిలీజ్ చేసిన ఈ ట్రైలర్ తో చిత్ర యూనిట్ కు ఉపయోగం ఉంటుందనుకుంటే అత్యాశే అవుతుంది.

ADVERTISEMENT
Latest Stories