ఈ ఏడాది అత్యధికులు వీక్షించే సినిమా!

most viewed movie in 20152015 సంవత్సరానికి గానూ అత్యధికులు వీక్షించిన సినిమాగా మన తెలుగు సినిమా ‘బాహుబలి’ నిలిచింది. అయితే ఈ ఏడాదికి గానూ ఏ సినిమా నిలుస్తుందన్న ఆసక్తి సినీ వర్గాల్లో వ్యక్తమవుతోంది. దీనికి సమాధానమే ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ ఇచ్చారు. “ఈ ఏడాది ఎక్కువ మంది ప్రేక్షకులు వీక్షించనున్న చిత్రం ‘సచిన్’ కావచ్చని సంగీత దిగ్గజ డైరెక్టర్ ఏఆర్ రెహ్మాన్ అభిప్రాయపడ్డారు.

క్రికెట్ దేవుడు లెజెండరీ క్రీడాకారుడు సచిన్ టెండూల్కర్ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిస్తున్న చిత్రం ‘సచిన్’కు సంగీతం అందిస్తున్న ఏఆర్ రెహ్మాన్ మాట్లాడుతూ… సచిన్ జీవితం గురించి గతంలో ఎన్నడూ వినని, చూడని అంశాలు కూడా ఈ చిత్రంలో చాలా ఉన్నాయని, అందుకే ఈ చిత్రం విడుదల కోసం తాను ఆతృతగా ఎదురు చూస్తున్నానని అన్నారు.

ADVERTISEMENT

తన వంతు భాగంగా ఈ సినిమాకు వినసొంపైన సంగీతాన్ని అందించానని, ప్రస్తుతం తుదిమెరుగులు దిద్దుకునే పనిలో సినిమా ఉందని చిత్ర విశేషాలను మీడియాకు తెలిపారు. జేమ్స్ ఎర్స్కిన్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా టీజర్ విడుదలై ప్రేక్షకుల ఆదరణ చూరగొన్న విషయం తెలిసిందే.

ADVERTISEMENT
Latest Stories