బాబు బెదిరించే వాడైతే ఆయన రాష్ట్రానికి వచ్చి మోత్కుపల్లి అలా మాట్లాడగలరా?

Motkupalli Narasimhulu comments on chandrababu naiduఅదేంటో ఆంధ్రప్రదేశ్ కు ఏదన్నా మంచి పేరు వస్తే వెనువెంటనే ముద్రగడో లేక మోత్కుపల్లో వచ్చి చంద్రబాబును చెడామడా తిట్టేసి వెళ్ళిపోతారు. తాజాగా సరళతర వాణిజ్యంలో మొదటి ర్యాంకు రావడంతో తెల్లారిందే మోత్కుపల్లి వచ్చి చంద్రబాబుని దూషించి వెళ్లారు. అది కూడా తిరుపతి వచ్చి.

ADVERTISEMENT

చంద్రబాబు నాయుడు అధికారం కోసం ఎన్టీఆర్‌ను తీవ్ర మానసిక క్షోభకు గురిచేశారని ఆరోపించారు. చంద్రబాబు దుర్మార్గుడని తెలంగాణ ప్రజలు తరిమికొట్టే సమయంలో తాను అండగా ఉన్నానని చెప్పారు. తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌ రావు తన స్నేహితుడని అయినా కూడా చంద్రబాబును వెనుకేసుకొచ్చినట్లు తెలిపారు.

తనకు ఎదురు తిరిగిన వారిని బెదిరిస్తాడని లేకపోతే వారిని అంతమొందిచే వరకూ నిద్రపోడని విమర్శించారు. తనను కూడా పోలీసులు ద్వారా బెదిరించారని, అయినా తాను ఏమాత్రం భయపడనని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబును ఓడించాలని స్వామిని కోరుకుంటానని చెప్పారు. చంద్రబాబు బెదిరించే వాడైతే ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న రాష్ట్రానికి వచ్చి మోత్కుపల్లి ఆ విధంగా మాట్లాడగలరా?

ADVERTISEMENT
Latest Stories