పాపం వరుసగా మూడు సినిమాలు ఫ్లాప్స్ అయ్యాయి..బహుశా అంట పెద్ద బ్యాక్ గ్రౌండ్ నుంచి వచ్చిన హీరోలకు ఇలాంటివి కాస్త ఇబ్బంది పెట్టె వ్యవహారాలే. ఎందుకంటే ఒక్కటంటే ఒక్కటైనా హిట్ అవ్వాలి అన్న కసి ఉందిగా…ఇదిలా ఉంటే అఖిల్ తాజా సినిమా మజ్ను విషయంలో చాలా తప్పే చేస్తున్నాడు.
మజ్ను సినిమా ఎలా ఉన్నా..బయ్యర్స్ కి బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి దానికి గల కారణం ఏంటి అంటే సినిమా డిజాస్టర్ కాదు…యావరేజ్ అంటున్నారు…పైగా ఒక్క ఎఫ్-2 మినహా మార్కెట్ లో పెద్దగా సినిమాలు ఏమి లేవు..అయితే సినిమా ప్రేక్షకులకు మజ్ను చూసే అవకాశం చాలానే ఉంది…కాకపోతే అది వాళ్ళ నోళ్ళల్లో నానితేనే…కానీ సినిమా ప్రేక్షకుల నోళ్ళల్లో నానాలి అంటే అఖిల్ తన కనీస ప్రయత్నంగా ప్రమోషన్ చేసి ఉంటే బావుండేది.
కానీ సినిమా పోయింది అని తెలియగానే అఖిల్ సైలెంట్ అయిపోయాడు..కనీసం సినిమాని ప్రమోట్ చేద్దాం అని కూడా లేకుండా చేసాడు..కట్ చేస్తే సినిమాని కొన్న వారు భారీ నష్టాల్లో కూరుకుపోయారు అనే చెప్పాలి. మొత్తంగా చూసుకుంటే అఖిల్ కాస్త ట్రై చేసి ఉంటే మరింత మంచి ఫలితాలు వచ్చేయేమో.



