ట్రైలర్ టాక్ – హీరో గారి కూతురు బాగానే పరిచింది!

mr manmadha for sale trailer talkసినీ హీరోల కూతుర్లలో ఎంట్రీ ఇచ్చిన అతి కొద్ది మందిలో శరత్ కుమార్ తనయురాలు వరలక్ష్మి ఒకరు. ప్రముఖ హీరోతో ఎఫైర్ ఉందంటూ ఒకప్పుడు హాట్ టాపిక్ గా నిలిచిన వరలక్ష్మి నటించిన ఓ తమిళ సినిమా ప్రస్తుతం తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ‘మన్మధ’ చిత్ర హీరో శింబు హీరోగా నటించిన ఈ సినిమా “మిస్టర్ మన్మధ ఫర్ సేల్” పేరుతో విడుదల కానుంది. దీనికి సంబంధించిన ధియేటిరికల్ ట్రైలర్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది.

ట్రైలర్ ఆద్యంతం ఆడియన్స్ ను ఆకట్టుకున్న అంశాలలో ప్రధానమైనది వరలక్ష్మి బహిర్గత పరిచిన అందచందాలు. క్యూట్ గా కనపడుతూ వరలక్ష్మి ప్రదర్శించిన హావభావాలు యువతకు గిలిగింతలు పెడతాయి. అలాగే ‘మన్మధ’ ట్యాగ్ లైన్ ఉన్న శింబు సినిమాల కధ మాదిరే రొమాంటిక్ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ సినిమా తమిళంలో బాగానే వసూలు రాబట్టింది. చాలా కాలం తర్వాత శింబు హీరోగా నటించిన ఓ సినిమా తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తోంది. వరలక్ష్మి అందచందాలు హైలైట్ గా వస్తున్న ఈ సినిమాను ప్రేక్షకులు ఎంతవరకు ఆదరిస్తారో లేదో గాని, ప్రస్తుతం ట్రైలర్ మాత్రం వెబ్ మీడియాలో సందడి చేస్తోంది.

ADVERTISEMENT

ADVERTISEMENT
Latest Stories