రాజకీయ చదరంగంలో పావుగా ముద్రగడ?

Mudragada Padmanabhamపవన్‌ కళ్యాణ్‌ కాపు ఓట్లను చంద్రబాబు నాయుడుకి తాకట్టు పెడుతున్నారంటూ వైసీపీ నేతలు చేస్తున్న విమర్శలకు ఇప్పుడు జనసేన కూడా అదేవిదంగా జవాబు చెపుతోంది.

తమ అధినేత పవన్‌ కళ్యాణ్‌ జగన్ ప్రభుత్వ అసమర్ధతను, అవినీతిని, అరాచకాలను నిలదీసి ప్రశ్నిస్తుంటే, ముద్రగడ పద్మనాభం మద్దతు తెలుపకపోగా అభ్యంతరం చెపుతూ ఎందుకు లేఖలు వ్రాస్తున్నారని ప్రశ్నిస్తున్నారు. కాకినాడ వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌ దౌర్జన్యాలను పవన్‌ కళ్యాణ్‌ ప్రశ్నిస్తుంటే, ముద్రగడ ఆయనను ఎందుకు సమర్ధిస్తున్నారని జనసేన ప్రశ్నిస్తోంది.

ADVERTISEMENT

అంతే కాదు… ఆనాడు ముద్రగడ మాటలు నమ్మి ఆయనతో కాపు రిజర్వేషన్స్ కోసం పోరాడుతున్నప్పుడు, ఆయన తమకు పెట్టిన ఉప్మా కోసం జనసేన కార్యకర్తలు ఆయనకు ‘ఉప్మా ఖర్చు’ కోసం మానియార్డర్లు కూడా పంపిస్తూ నిరసన తెలియజేస్తున్నారు. ఆయన కాపుల ఓట్లను వైసీపీకి తాకట్టు పెడుతున్నారని జనసేన ఆరోపిస్తోంది.

జనసైనికుల ర్యాంగింగ్ భరించలేక ముద్రగడ పద్మనాభం మళ్ళీ పవన్‌ కళ్యాణ్‌కు మరో బహిరంగలేఖ వ్రాశారు. ఓ పౌరుడుగా నా అభిప్రాయాలు వ్యక్తం చేసే హక్కు నాకుంది. నేను పవన్‌ గురించి నా అభిప్రాయాలు చెపితే జనసేన కార్యకర్తలు నాకు ఫోన్లు చేసి బెదిరిస్తున్నారు.

కాపు ఉద్యమంలో ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌ నాకు ఎంతగానో సహాయపడ్డారు. అటువంటి వ్యక్తిని పవన్‌ కళ్యాణ్‌ నోటికి వచ్చిన్నట్లు మాట్లాడటం తప్పని చెపితే నన్ను వేధిస్తారా? ఇలాంటి బెదిరింపులకి నేను భయపడేవాడిని కానని గ్రహిస్తే మంచిది,” అంటూ వ్రాశారు.

ముద్రగడ పద్మనాభం కాపుల సంక్షేమం కోసం పనిచేయాలంటే అందరినీ కలుపుకుపోతూ పనిచేయవచ్చు. అదే… రాజకీయాలలో కొనసాగాలనుకొంటే వైసీపీలో చేరిపోయి ఎన్నికలలో పోటీ చేయవచ్చు. కానీ పవన్‌ కళ్యాణ్‌కు గురిపెట్టేందుకు వైసీపీకి తన భుజం అప్పగించడమే ఆక్షేపనీయం! కాపు కులస్తుల ఓట్లను వైసీపీకి మళ్ళించాలని ప్రయత్నిస్తుండటమే ఆక్షేపనీయం!

అయినా జగన్, పవన్ ఇద్దరిలో ఎవరు కాపులకు మేలు చేస్తారో ఇంకా గ్రహించలేకపోతే ఈ రాజకీయ చదరంగంలో ముద్రగడ ఓ పావుగా మిగిలిపోవచ్చు.

ADVERTISEMENT
Latest Stories