పెళ్లి ఒకరితో… ఫస్ట్ నైట్ ఇంకొకరితో అంటే ఎలా..!

Music director Thaman praisesతన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో ప్రస్తుతం టాలీవుడ్ ను సంగీత దర్శకుడు థమన్ ఏలుతున్నారు. తక్కువ సమయంలోనే ఎక్కువ సినిమాలకు వర్క్ చేసిన మ్యూజిక్ డైరెక్టర్ గా కీర్తిని అందుకున్న థమన్, తాజాగా అలీతో సరదాగా కార్యక్రమంలో పాల్గొన్నారు. దీనికి సంబంధించిన ప్రోమో రిలీజ్ కాగా, పలు ఆసక్తికర అంశాలను ఈ ప్రోమోలో కట్ చేసారు.

టాలీవుడ్ లో ఇంత సక్సెస్ అయిన నువ్వు, బాలీవుడ్ లో ఎందుకు అలా… అన్న ప్రశ్నకు, ‘ఇప్పటి వరకు 3 సినిమాలకు వర్క్ చేసానని, కానీ ఒక సినిమాకు ఐదారుగురు సంగీత దర్శకులు పని చేయడం ఏమిటో నాకు అర్ధం కాదని, ఒక పాటకు ఒక్క సంగీత దర్శకుడు అని చెప్పడం, ఆర్ఆర్ కూడా అక్కడక్కడా వర్క్ చేయడం అనేది, పెళ్లి ఒకరితో ఫస్ట్ ఇంకొకరితో అన్న రీతిలో ఉంటుందని నవ్వేశారు థమన్.

ADVERTISEMENT

తన ఇంట్లో తన భార్యే బాగా ట్రోల్ చేసేస్తుందని, తనకు ఇంట్లో ఉన్న ట్రోలింగ్ ఎక్కువని, అందుకే బయట ట్రోలింగ్ పెద్దగా పట్టించుకోనని తనపై వచ్చిన ట్రోల్స్ గురించి ప్రస్తావించారు. తన మొదటి సంపాదన ‘భైరవద్వీపం’ సినిమాకు 30 రూపాయలు వచ్చాయని, ఆ సినిమాలో రోజా పైకి లేచినప్పుడల్లా డ్రమ్స్ వాయించింది తానేనని చెప్పుకొచ్చారు.

తనకు బాడీలో బరువుంది కాబట్టి, హెడ్ లో వెయిట్ లేదని, తెలుగు రాయడం అనేది త్రివిక్రమ్ గారితో పని చేసినప్పటి నుండి నేర్చుకుంటున్నానని అన్నారు. 2000లో శంకర్ గారి సినిమాలో చేసిన తాను 2020లో శంకర్ గారి సినిమాకు పని చేయడం పట్ల సంతోషంగా ఉన్నానని, ఆ ఫోటోలో తాను వేసుకున్న సూట్ తనకు సూట్ కాలేదన్న పంచ్ లతో ఈ ప్రోమోను కట్ చేసారు.

ADVERTISEMENT
Latest Stories