మెగా కాంపౌండ్ నుండి పవన్ కు మద్దతు!

Naga-Babu-supports pawan kalyanమెగా సోదరుల మధ్య రాజకీయంగా ఎన్ని విభేదాలు ఉన్నప్పటికీ, కొన్ని విషయాలలో మాత్రం బహిరంగంగానే మద్దతు తెలుపుతుంటారు. పవన్ ‘జనసేన’ పార్టీ పెట్టినప్పటికీ, తన అడుగులు మాత్రం చిరంజీవి వెంటేనని గతంలో తేల్చిచెప్పిన నాగబాబు, తాజాగా ‘జనసేన’ చేపడుతోన్న ఆందోళనకు మద్దతు తెలిపారు. ఇప్పటికే వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్ లు తమ మద్దతు ప్రకటించగా, తాజాగా ఆ జాబితాలో ‘టవర్ స్టార్’ కూడా చేరారు. గురువారం నాడు విశాఖ వేదికగా ఆర్ కే బీచ్ లో ‘మౌన నిరసన’కు పవన్ కళ్యాణ్ కు అండగా నిలుస్తానని తెలిపారు.

ప్రత్యేక హోదా ఆంధ్ర ప్రజల హక్కు అని, ఈ అంశంలో పోరాటానికి దిగే ఇతర రాజకీయ పార్టీల నేతలకూ, యూనివర్శిటీల విద్యార్థినీ విద్యార్థులకు, మెగా అభిమానులకు సైతం మద్దతిస్తానని చెప్పారు. తన సోదరుడి ఆదర్శాలు, ఆలోచనా విధానంతో ఏకీభవిస్తున్నానని విశాఖపట్నంలో ఆర్కే బీచ్ లో జరగబోయే శాంతి ర్యాలీకి తన మద్దతు ఉంటుందని అన్నారు. అయితే ఈ ర్యాలీకి అనుమతి లేదని ఏపీ డీజీపీ ఇప్పటికే స్పష్టం చేయడంతో ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయోనని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

ADVERTISEMENT

ADVERTISEMENT
Latest Stories