చెర్రీతో వదిలేసాడు… బన్నీతో మొదలుపెట్టాడు..!

Naga Babu to Produce Allu Arjun Na Peru Surya Na Illu Indiaవరుస సమ్మర్ సక్సెస్ లతో మంచి ఊపులో ఉన్న అల్లు అర్జున్, తన తాజా చిత్రం “దువ్వాడ జగన్నాధమ్” సినిమా ముగిసిందో లేదో మరో సినిమాను మొదలు పెట్టేసాడు. ప్రముఖ రచయిత వక్కంతం వంశీ దర్శకుడిగా పరిచయం కాబోతున్న ఈ సినిమా పూజా కార్యక్రమాలు జరుపుకుంది. అంతకుముందు హల్చల్ చేసిన “నా పేరు సూర్య” అన్న టైటిల్ నే ఖరారు చేస్తూ… దానికి “నా ఇల్లు ఇండియా” అన్న ట్యాగ్ లైన్ ను యాడ్ చేసారు.

రామ్ చరణ్ ‘ఆరంజ్’ సినిమాతో సినీ నిర్మాణాన్ని వదిలేసిన ‘టవర్ స్టార్’ నాగబాబు, మళ్ళీ చాలా కాలం తర్వాత బన్నీ సినిమాతో ఆ దిశగా అడుగులు వేయడం విశేషం. అలాగే లగడపాటి శ్రీధర్, బన్నీ వ్యాస్ లు సంయుక్తంగా ఈ సినిమా నిర్మాణ బాధ్యతలను చేపట్టనున్నారు. బాలీవుడ్ నాట ప్రముఖ సంగీత దర్శకులుగా కొనసాగుతున్న విశాల్ – శేఖర్ లు ఈ సినిమాతో తెలుగు ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నారు.

ADVERTISEMENT

నిజానికి ఈ సినిమాను తొలుత జూనియర్ ఎన్టీఆర్ తో తెరకెక్కించడానికి వక్కంతం వంశీ సన్నాహాలు చేసుకుని, ఓ ఇంటర్వ్యూలో స్పష్టత కూడా ఇవ్వగా, చివరి నిముషంలో అది కాస్త బన్నీ సొంతమైంది. సహజంగా చేతులు మారిన సినిమాలు ఆయా హీరోల కెరీర్లో భారీ హిట్లు సాధించిన ట్రాక్ రికార్డ్ టాలీవుడ్ లో ఉంది. అదే లెక్కన అల్లు వారబ్బాయి కూడా ఈ “నా పేరు సూర్య”తో అదిరిపోయే రికార్డులు కొడతారేమో చూడాలి.

ADVERTISEMENT
Latest Stories