సతీమణి కోసం గరిట పట్టిన హీరో గారు!

Naga Chaitanya Cooking for Samantha Akkineniప్రేమించి పెళ్లి చేసుకున్న నాగచైతన్య- సమంతల కాపురం మూడు గరిటెలు, ఆరు కూరల మాదిరి విజయవంతంగా సాగుతోంది. పెళ్లికి ముందు ప‌లుసార్లు త‌న కోసం వంట చేస్తుండ‌గా స‌మంత త‌న సోష‌ల్ మీడియా ఖాతాల్లో నాగ‌చైత‌న్య పోటోల‌ను పోస్ట్ చేసిణ విషయం తెలిసిందే. అయితే పెళ్ల‌యిన త‌రువాత కూడా చైతూ త‌న శ్రీమ‌తికి వంట చేసి పెడుతున్నాడు.

త‌మ పెళ్లి జ‌రిగి నెల‌ రోజులు గ‌డుస్తోన్న నేప‌థ్యంలో నాగ‌ చైత‌న్య‌… సమంత కోసం స్వయంగా మ‌రోసారి ప్రత్యేక వంట చేశాడు. త‌న‌కు త‌న భ‌ర్త సర్‌ప్రైజ్ ఇచ్చాడ‌ని, సమంత తన సోషల్ మీడియా ఖాతా ద్వారా తెలిపింది. తాను ప్రపంచంలోనే అతి ఉత్తమ వ్యక్తిని పెళ్లి చేసుకున్నానని, ఈ జీవితం ఎంతో హ్యాపీగా ఉంద‌ని తన ఆనందాన్ని పంచుకుంది.

ADVERTISEMENT
ADVERTISEMENT
Latest Stories