సుకుమార్ చేతుల్లో యువ హీరో!

Naga Shaurya next with Director Sukumarటాలీవుడ్ లో టాలెంటెడ్ యువ హీరోల్లో నాగ సౌర్య ఒకరు. అయితే పెద్దగా బ్యాక్ గ్రౌండ్ లేకపోయినా తనదైన శైలిలో సినిమాలు చేసుకుంటూ పోతున్నాడు ఈ కుర్ర హీరో. చలో…నర్తనశాలతో మంచి హిట్స్ అందుకున్న నాగ సూర్య గత రెండు సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద భారీ డిజాస్టర్స్ గా మారాయి.

[m9ad]

ADVERTISEMENT

ఈ క్రమంలో నాగ సౌర్యకు హిట్ కావాలి..అయితే అదృష్టమో…లేక వరమో తెలీదు కానీ, టాలీవుడ్ సర్కిల్స్ నుంచి వినిపిస్తున్న కధనం ప్రకారం డైరెక్టర్ సుకుమార్, నాగ సౌర్య కోసం ఒక కధ సిద్ధం చేసాడు అని, త్వరలో అతనితో ఒక సినిమా చేయనున్నాడు అని వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. అయితే ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఏంటి అంటే ఈ సినిమాని సుకుమార్ శిష్యుల్లో ఒకరు డైరెక్ట్ చేయనున్నారట…ఇక సుకుమార్ నిర్మాతగా వ్యవహరించనున్నాడట.

మరి కుమారి 21 ఎఫ్ తో నిర్మాతగా బ్లాక్ బష్టర్ హిట్ కొట్టిన సుకుమార్ ఈ సినిమాతో ఏ రేంజ్ హిట్ అందుకుంటాడో…అదే క్రమంలో హిట్ కోసం ఎదురు చూస్తున్న నాగసౌర్య కి ఎలాంటి హిట్ ని అందిస్తాడో చూడాలి.

ADVERTISEMENT
Latest Stories