మొత్తానికి నాగబాబు దిగి వస్తున్నారా? ఇక్కడితో ఆపేస్తారా?

Nagababu coming to compromise on balakrishna controversyమెగా బ్రదర్ నాగబాబు ఇటీవలే కాలంలో నటుడు, తెలుగు దేశం పార్టీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణపై విరుచుకు పడుతున్నారు. మొదట్లో బాలయ్య ఎవరో తెలీదు అంటూ మొదలు పెట్టారు ఆయన. గతంలో ఒక సందర్భంలో బాలయ్య పవన్ కళ్యాణ్ ఎవరో తెలీదు అనడంతో నాగబాబు దానికి ప్రతీకారం తీర్చుకుంటున్నారని ఒక వర్గం సమర్ధించింది కూడా. అయితే నాగబాబు అక్కడితో ఆగలేదు. బాలయ్య మీద వరుసగా ఏదో ఒక వివాదాస్పద కామెంట్లు చెయ్యడం మొదలు పెట్టారు.

ADVERTISEMENT

దీనితో నాగబాబు తో పాటు తాను సాయం చేస్తున్నా అని అనుకుంటున్న జనసేన పార్టీ కూడా అనవసర వివాదాల్లో పడింది. మొన్న చెన్నైలోని ఒక కాలేజ్ కు నాగబాబు చీఫ్ గెస్ట్ గా వెళ్లారు అయితే అక్కడ స్టేజి మీద ఆయనను కనీసం మాట్లాడనివ్వకుండా చేశారు బాలయ్య అభిమానులు. ఇన్ని వివాదాల నడుమ జనసేన అభిమానులలో ఒక వర్గం కూడా నాగబాబు పార్టీకి చెడ్డ పేరు తెస్తున్నారని ఆరోపించడంతో ఆయన కొంత మేర దిగి రావాల్సి వచ్చింది. బాలయ్యను తాను ఎందుకు టార్గెట్ చేశాను అని వివరిస్తూ ఆయన ఒక వీడియో పెట్టారు.

తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తెచ్చిన పవన్ కళ్యాణ్ నే ఎవరో తెలీదు అంటూ మాట్లాడటం తాను తట్టుకోలేకపోయానని ఆయన చెప్పుకొచ్చారు. ఆ ఒక్క సందర్భంలోనే కాకుండా ఆ మనిషి గత ఐదు ఆరు సంవత్సరాలుగా తమ కుటుంబాన్ని టార్గెట్ చేస్తున్నారని చెప్పుకొచ్చారు. రాత్రికి దీనిపై ఇంకో వీడియో పెడతా అని కూడా చెప్పుకొచ్చారు. మొత్తానికి ఈ వివాదానికి ఇక్కడితో ముగింపు చెబుతారేమో చూద్దాం. ఏది ఎలా ఉన్న పవన్ కు సాయం చేస్తున్నా అనుకుని నాగబాబు నష్టం చెయ్యకుండా ఉంటే చాలు.

అయితే నాగబాబు ఇచ్చిన ఈ సంజాయిషీని కూడా చాలా మంది తప్పులు పడుతున్నారు. “బాలయ్య పవన్ కళ్యాణ్ మధ్య వివాదం రాజకీయ పరమైనది. నాగబాబు పర్సనల్ గా వెళ్తున్నారు. సరే అది పక్కన పెడితే పవన్ కళ్యాణ్ ను అమ్మనా బూతులు తిట్టిన రోజా పక్కన కూర్చుని రోజాతో వెకిలి నవ్వులు ఎందుకు నవ్వుతున్నట్టు?,” అని వారు ప్రశ్నిస్తున్నారు. అది కూడా పాయింటే కదా? ఎన్నికల సమయంలో ఇటువంటి అనవసర వివాదాలు జనసేన పార్టీకి కూడా చేటు చేస్తాయి.

ADVERTISEMENT
Latest Stories