మీడియా సాక్షిగా మెగా ఫామిలీకి ‘ఆ’ సెగ తప్పదా

NagaBabu comments on Balakrishna effects varun tejటాలీవుడ్ లో నాగబాబు చేసిన కామెంట్స్ ఇప్పుడు కొడుకు మెడకు చుట్టుకోనున్నాయా? కాస్త పొగరుగా మాట్లాడిన నాగ బాబు తానూ చేసిన తప్పు వాళ్ళ తర్వాత జరిగే పరిమాణాల గురించి ఏమాత్రం ఆలోచించకుండా తమ్ముడుపై ప్రేమతో బాలయ్య అప్పుడెప్పుడో చేసిన కామెంట్స్ కి కౌంటర్ గా ‘బాలయ్య ఎవరో నాకు తెలీదు’ అని అనేశాడు. ఆ తర్వాత సోషల్ మీడియాలో జరిగిన రచ్చ వల్ల తాను అన్నది కమెడియన్ వల్లూరి బాలకృష్ణ ను అని కవర్ చేసాడు.

[m9ad]

ADVERTISEMENT

అయితే బాలయ్యను ఎదో అనేశాము అని నాగబాబు తనకు వచ్చే నష్టం ఏమి లేదు అని అనుకున్నప్పటికీ, తన కొడుకు వరుణ్ కి మాత్రం బాలయ్య సెగ తగిలేలా కనిపిస్తుంది. త్వరలో వరుణ్ నటించిన అంతరిక్షం…ఎఫ్-2 సినిమాల ప్రమోషన్స్ కోసం వరుణ్ మీడియా ముందుకు వచ్చినప్పుడల్లా వరుణ్ కి ఈ మాట ఎదురవ్వక తప్పదు.

అయితే ఆ మాటకు వస్తే వరుణ్ ఒక్కడికే కాదు… మెగా ఫ్యామిలి మొత్తానికి ఈ సెగ తగలక తప్పేలా లేదు…మరి దీనిపై మెగా ఫామిలీ ఎలా స్పందిస్తుందో…నాగబాబుని కవర్ చేస్తుందో…లేక బాబు చేసింది పొరపాటే అని మ్యాటర్ ని సైడ్ చేస్తుందో చూడాలి.

ADVERTISEMENT
Latest Stories