ప్రమోషన్స్ కు ఇలాంటి వీడియోనా?

Nagarjuna Officer movie promotion video‘కింగ్’ నాగార్జున హీరోగా రాంగోపాల్ వర్మ తెరకెక్కించిన “ఆఫీసర్” సినిమా ప్రమోషన్స్ కోసం చిత్ర యూనిట్ తీవ్రంగా శ్రమిస్తోంది. ఇప్పటివరకు విడుదల చేసిన టీజర్, ట్రైలర్, వీడియో సాంగ్ ప్రోమో… ఇలా ఏ ఒక్కటి కూడా ప్రేక్షకులను ఆకర్షించకపోవడంతో, తాజాగా ‘ఆఫీసర్ సౌండ్’ పేరుతో ఓ వీడియోను విడుదల చేసారు వర్మ. అయితే ఇది కూడా ఏ మాత్రం ‘సౌండ్’ చేయలేని స్థితిలో ఉండడం విశేషం.

ADVERTISEMENT

ట్రైనింగ్ లో భాగంగా ఓ రింగ్ లో నాగ్ ఇచ్చిన పంచ్ తో విడుదల చేసిన ఈ వీడియో ఏ విధంగా ప్రభావితం చూపుతుందని వర్మ విడుదల చేసారో ఆయనకైనా తెలుసో లేదో మరి! రవిశంకర్ అందించిన బ్యాక్ గ్రౌండ్ ‘సౌండ్’ ఒక్కటే వినిపించగా, జూన్ 1వ తేదీన ‘ఆఫీసర్’ తమ డ్యూటీని స్వీకరించబోతున్నాడని ఖరారు చేసారు. ఈ సినిమా ఫలితంతో అఖిల్ – వర్మల సినిమా ఫేట్ డిసైడ్ కానుందనేది టాలీవుడ్ టాక్.

ADVERTISEMENT
Latest Stories