“ఊపిరి” ఐటెం సాంగ్ లో రెచ్చిపోయిన నాగ్!

Nagarjuna Oppiri item song Door No Okkatti‘కింగ్’ నాగార్జున నటించిన “ఊపిరి” వీడియో పాటల ప్రోమోలు వెబ్ మీడియాలో సందడి చేస్తున్నాయి. ఒక ఫీల్ గుడ్ చిత్రంగా రూపుదిద్దుకున్న ఈ సినిమాలో ఒక ‘జబర్దస్త్’ ఐటెం సాంగ్ కూడా ఉంది. రచయిత రామజోగయ్య శాస్త్రి అందించిన సాహిత్యానికి సంగీత దర్శకుడు గోపీ సుందర్ మాంచి మాస్ ట్యూన్ ఇచ్చారు.

సాధారణంగా ఐటెం సాంగ్ అనగానే, ఆ పాటలో నర్తించిన ముద్దుగుమ్మ అందాలు గురించి మాట్లాడుతుంటారు. కానీ, ‘ఊపిరి’ సినిమా ఐటెం సాంగ్ మాత్రం ప్రత్యేకం అనే చెప్పాలి. ఈ పాటలో నటించిన ముద్దుగుమ్మను పక్కన పెడితే, వీల్ చైర్ లో కూర్చుని ‘కింగ్’ నాగ్ ప్రదర్శించిన హావభావాలు అభిమానులకు, మాస్ ప్రియులకు కావల్సినంతా కిక్ ఇస్తాయి.

ADVERTISEMENT

‘అబ్బా… అబ్బా… అబ్బబ్బా…’ అంటూ నాగ్ హావభావాలు ఈ ఐటెం సాంగ్ కే హైలైట్ గా నిలుస్తున్నాయి. వాటిని వర్ణించడం కన్నా… ఒక్కసారి ఆ పాటను వీక్షిస్తే… నాగ్ ఏ రేంజ్ లో రెచ్చిపోయారో అర్ధమవుతుంది. నిజంగా ఆ ముద్దుగుమ్మ పక్కన నాగ్ స్టెప్పులేసినా ఈ రేంజ్ లో పండేది కాదని చెప్పవచ్చు.

ADVERTISEMENT
Latest Stories