“ఆఫీసర్” కలెక్షన్స్ పై నాగార్జున స్పందన!

Nagarjuna responds on Officer collectionsగడిచిన రెండు రోజులుగా సోషల్ మీడియాలో వర్మ – నాగార్జునల “ఆఫీసర్” సినిమా కలెక్షన్స్ పై జరుగుతోన్న రచ్చ తెలిసిందే. నెగటివ్ షేర్స్ వసూలు చేసిన తొలి చిత్రంగా ‘ఆఫీసర్’ రికార్డులకెక్కిందని నెటిజన్లు కోడై కూస్తున్నారు. ముఖ్యంగా నాగ్ కెరీర్ లో ‘ఆఫీసర్’ ఓ మాయని మచ్చలా మిగిలిపోవడం అక్కినేని అభిమానులు జీర్ణించుకోలేని అంశంగా మారింది.

ADVERTISEMENT

మరోవైపు వర్మతో ఉన్న వైరంతో మెగా అండ్ పవన్ ఫ్యాన్స్ ‘ఆఫీసర్’ మూవీని మరింతగా ఏకిపారేస్తున్నారు. దీంతో నాగ్ స్పందించక తప్పలేదు. నేరుగా కాకపోయినా… సోమవారం నాడు ఉదయం ‘గుడ్ మార్నింగ్’ సందేశంతో ‘ఆఫీసర్’ ఫలితంపై పరోక్షంగా తన అభిప్రాయాన్ని చెప్పకనే చెప్పారు. మనోనిబ్బరం… మెచ్యూరిటీతో కూడిన ఆ ట్వీట్ ఏమిటంటే….

మళ్ళీ సోమవారం వచ్చింది… మరో వారం గడిచిపోయింది. ఈ సమయంలో విన్స్టన్ రాసిన “సక్సెస్ అనేది ఫైనల్ కాదు, ఫెయిల్యూర్ అనేది ఫాటల్ (ప్రాణాంతకమైనది) కాదు, కరేజ్ అనేది ముఖ్యం” వ్యాఖ్యలు గుర్తుకు వచ్చాయని, నవ్వుతూ గడిపేయడమే, మంచి రోజు కావాలి అంటూ శుభాకాంక్షలు చెప్తూ చేసిన ట్వీట్ లో ఆంతర్యం ఏమిటో అర్ధం చేసుకోవచ్చు.

ADVERTISEMENT
Latest Stories