అక్కినేని వారి ఇంట అడుగు పెట్టబోతున్న సమంత, ఆ కుటుంబంలో ఎంతగా కలిసిపోయింది అని చెప్పడానికి ఒక నిదర్శన ఈ ఉదంతం. ఇటీవల చైతూ నటించిన “రారండోయ్ వేడుక చూద్దాం” సినిమా ధియేటిరికల్ ట్రైలర్ విడుదలైన విషయం తెలిసిందే. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ ట్రైలర్ ను సమంత తన స్పందనను ఏమిటో సోషల్ మీడియాలో వ్యక్తపరిచింది. అయితే అభిమానులతో పాటు మామ గారైన కింగ్ నాగార్జునకు వ్యక్తిగతంగా వాట్సప్ లో సందేశం పంపింది.
సమంత ఇచ్చిన ఈ రియాక్షన్స్ ను నాగ్ తాజాగా సోషల్ మీడియాలో స్క్రీన్ షాట్ కొట్టి పోస్ట్ చేసారు. శనివారం నాడు చోటు చేసుకున్న ఈ సంభాషణలో సమంతకు నాగ్… “కంగ్రాట్స్ కోడలా అంటూ చెప్పగా, నాకు ట్రైలర్ బాగా నచ్చింది, లవ్ మామా… అంతా బాగా జరుగుతోంది. చైతూ చూడడానికి సూపర్ గా ఉన్నాడు, నేను చాలా సంతోషంగా ఉన్నాను, కృతజ్ఞతలు…” అంటూ ప్రతిస్పందించింది. మామ – కోడలు మధ్య చోటు చేసుకున్న ఈ అనుభూతులను నాగ్ సోషల్ మీడియాలో పెట్టిన ఆంతర్యం ఏమిటి? అన్నది ఆసక్తికరంగా మారింది.



