నాగ్ డ్యామేజ్ కంట్రోల్ ట్వీట్!

Nagajuna watched Devadas with familyఇటీవల జరిగిన ప్రెస్ మీట్ లో దర్శకుడు శ్రీరామ్ ఆదిత్యపై వెలిబుచ్చిన అసంతృప్తి, “దేవదాస్” సినిమా బాగా రాలేదన్న సంకేతాలు నెటిజన్లలోకి వెళ్ళాయి. నాగ్ వ్యాఖ్యల తర్వాత పెద్ద ఎత్తున ఈ విషయంపై చర్చ జరిగింది, ఒక రకంగా సినిమాకు కూడా డ్యామేజ్ అయ్యింది. బహుశా వాటిని సవరించాలనుకున్నారో ఏమో గానీ, తాజాగా “దేవదాస్”పై ఓ ట్వీట్ వేసారు కింగ్ నాగార్జున.

[m9ad]

ADVERTISEMENT

“దేవదాస్ సినిమాను ఇప్పుడే చూసాను, ఖచ్చితంగా విజయాన్ని జేబులో పెట్టుకుని హైదరాబాద్ ను వీడి వెళ్తున్నాను, ఇక హాలిడే టైం, ఫ్యామిలీతో కలిసి ఆనందంగా బయలుదేరాను, లెజెండరీ వైజయంతీ మూవీస్ కు, అమేజింగ్ నానికి, యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ శ్రీరామ్ ఆదిత్యకు కృతజ్ఞతలు” అంటూ నాగ్ చేసిన ట్వీట్ కు నెటిజన్ల నుండి మిశ్రమ స్పందనలు లభించాయి.

మొన్న జరిగిన డ్యామేజ్ ను ఈ ట్వీట్ ద్వారా నాగ్ సవరించాలని చేసిన ప్రయత్నంగా ఎక్కువ మంది నెటిజన్లు రిప్లైలు ఇవ్వగా, నాచురల్ నాని స్పందిస్తూ… ‘మీ ట్వీట్ తో చాలా హ్యాపీగా ఉన్నా, రేపు ప్రేక్షకుల నడుమ ఈ సినిమాను చూడబోతున్నా… మీ ట్రిప్ బాగా జరగాలని ఆశిస్తున్నా… మీరు రిటర్న్ అయినపుడు మళ్ళీ కలుద్దాం’ అంటూ రిప్లై ఇచ్చారు. నాగ్ వెలిబుచ్చిన భిన్న స్పందనల నడుమ విడుదల కానున్న “దేవదాస్” ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో మరికొద్ది గంటల్లో తేలనుంది.

ADVERTISEMENT
Latest Stories