నారా రోహిత్‌ సినిమాలో మరో హీరో

nagashourya in nararohith movieనారా రోహిగ్‌ గత కొన్నాళ్లుగా టాక్‌ ఆఫ్‌ ది ఇండస్ట్రీగా ఉన్నాడు. ఈయన ఖాతాలో ప్రస్తుతం 10 సినిమాలు ఉన్నాయి. వాటిలో కొన్ని షూటింగ్‌ పూర్తి చేసుకుని విడుదలకు సిద్దంగా ఉన్నాయి. మరి కొన్నింటి చిత్రీకరణలో ఈయన పాల్గొంటున్నాడు. మరి కొన్ని ప్రారంభం అయ్యేందుకు రెడీ అవుతున్నాయి. తాజాగా ఈయన ప్రముఖ కమెడియన్‌ అవసరాల శ్రీనివాస్‌ దర్శకత్వంలో ‘జ్యో అచ్చుతానంద’ అనే చిత్రంలో నటించేందుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిన విషయం తెల్సిందే. ప్రముఖ నిర్మాత సాయి కొర్రపాటి ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నాడు. క్రేజీ కాంబినేషన్‌లో తెరకెక్కబోతున్న ఈ సినిమాపై ఇప్పటికే మంచి అంచనాలున్నాయి.

సినిమాపై ఉన్న అంచనాలు మరింతగా పెరిగేలా చిత్ర యూనిట్‌ సభ్యులు ఈ సినిమాలో మరో హీరో కూడా నటించబోతున్నట్లుగా ప్రకటించారు. నారా రోహిత్‌కు తమ్ముడిగా ఈ చిత్రంలో యువ హీరో నాగశౌర్య కనిపించబోతున్నాడు. నాగశౌర్యకు సక్సెస్‌ను తెచ్చి పెట్టిన ‘ఊహలు గుసగుసలాడే’ చిత్ర బ్యానర్‌ అవ్వడంతో పాటు ఆదే దర్శకుడు ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండటంతో నాగశౌర్య చిన్న పాత్రే అయినా నటించేందుకు ఓకే చెప్పాడు. ప్రస్తుతం అవసరాల ఈ సినిమాకు పక్కా స్క్రీప్ట్‌ను రెడీ చేసే పనిలో ఉన్నాడు. జనవరి లేదా ఫిబ్రవరిలో ఈ సినిమా పట్టాలెక్కే ఛాన్స్‌ ఉంది.

ADVERTISEMENT
Latest Stories