ట్రైలర్ టాక్ – చుక్కలు చూపించేలా ఉందే!

Nakshatram Theatrical Trailerకృష్ణవంశీ సినిమాలకు ఓ ప్రత్యేకమైన అభిమాన వర్గం ఉంటుందన్న విషయం తెలిసిందే. అయితే రానూ రానూ ఆ అభిమానులను కోల్పోయే విధంగా వంశీ చిత్రాలు నిలుస్తుండడం శోచనీయం. త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న “నక్షత్రం” ఎలా ఉంటుందో ఇప్పుడే చెప్పలేం గానీ, పబ్లిసిటీకి అత్యంత కీలకమైన అంశంగా పరిగణించే ధియేటిరికల్ ట్రైలర్ మాత్రం పూర్తిగా నిరాశపరిచిందని చెప్పవచ్చు. ఒక విధంగా చెప్పాలంటే… అంతకు ముందు విడుదలైన టీజర్ కు కొనసాగింపుగా కనపడుతోంది.

అసలు సినిమా కాన్సెప్ట్ ఏమిటో… ఎందుకు తీసారో… ప్రేక్షకులకు తెలియచెప్పే విధంగా ట్రైలర్ కటింగ్ లేకపోవడం విశేషం. కేవలం పోలీసులను హైలైట్ చేయడానికే అన్నట్లుగా ప్రకాష్ రాజ్ చేత ఓ రెండు డైలాగ్ లు, శివాజీరాజా అరుపులు ఉన్నాయి తప్ప ట్రైలర్ లో ఏ మాత్రం పస లేకపోవడం ప్రేక్షకులను నిరుత్సాహానికి గురి చేసే అంశం. ఇక తొలిసారిగా నెగటివ్ పాత్రలో నటించిన తనీష్ గురించి గానీ, హీరోగా నటించిన సందీప్ కిషన్ గురించి గానీ చెప్పుకోవడానికి ఏం లేదు. ఎందుకంటే ట్రైలర్ ఆ రేంజ్ లో నిరుత్సాహపరుస్తుంది గనుక!

ADVERTISEMENT

చివరగా… “నక్షత్రం” అని టైటిల్ పెట్టిన దర్శకుడు కృష్ణవంశీ.., ధియేటర్లలో గనుక టైటిల్ తగ్గ న్యాయం చేయలేకపోతే, ప్రేక్షకులకు పట్టపగలే ‘నక్షత్రాలు’ కనిపించడం ఖాయం అనే విధమైన సంకేతాలను ట్రైలర్ పంచుతోంది. ఉన్నంతలో ఊరట చెందే విషయం ఏమిటంటే… ప్రజ్ఞా జైస్వాల్, రెజీనాల గ్లామర్ షో వీక్షకులను ఆకట్టుకునే విధంగా ఉండడం!

ADVERTISEMENT
Latest Stories