బాలకృష్ణ Vs నాని!

Balakrishna Akhanda Vs Nani Shyam Singha Royఈ సంక్రాంతి హంగామా అంతా సిల్వర్ స్క్రీన్ పైనే లేదు, స్మాల్ స్క్రీన్ పైనే అని తేలిపోవడంతో, ప్రస్తుతం ఓటీటీలో ఏయే సినిమాలు ఎప్పుడెప్పుడు విడుదల అవుతున్నాయో చూసుకోవడం సినీ ప్రేక్షకుల వంతవుతోంది. ఇప్పటికే “పుష్ప” ప్రైమ్ లో సందడి ప్రారంభం కాగా, ఈ నెలలో మరో రెండు సినిమాలు తెలుగు ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమైపోతున్నాయి.

ఈ రెండూ కూడా ఒకే రోజు విడుదల అవుతుండడం అసలు విశేషం. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో నందమూరి నటసింహం బాలకృష్ణ బ్లాక్ బస్టర్ మూవీ “అఖండ” రిలీజ్ అవుతుండగా, నెట్ ఫ్లిక్స్ లో నాచురల్ స్టార్ నాని “శ్యామ్ సింగ రాయ్” ఈ నెల 21వ తేదీన ఓటీటీలో విడుదల కానున్నాయి. ఈ రెండు సినిమాలు కూడా ఆయా హీరోల కెరీర్ లో మరపురానివిగా నిలిచిపోయాయి.

ADVERTISEMENT

డిసెంబర్ మొదటి వారంలో రిలీజ్ అయిన “అఖండ” ఇప్పటికి వీకెండ్స్ లో అక్కడక్కడా హౌస్ ఫుల్ కలెక్షన్స్ ను సొంతం చేసుకుంటూ బాలయ్య మాస్ పవర్ ఏమిటో చాటి చెప్తోంది. ‘అఖండ’ 50 రోజులు పూర్తయిన సందర్భంగా ఓటీటీలో ఈ సినిమా రానుంది. థమన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాకు సెకండ్ హీరోగా మారిపోయింది.

డిసెంబర్ చివరి వారంలో క్రిస్మస్ కానుకగా రిలీజ్ అయిన “శ్యామ్ సింగ రాయ్” కూడా ప్రేక్షకులను అలరించడంలో సక్సెస్ అయ్యింది. ద్విపాత్రాభినయం చేసిన ఈ సినిమాలో టైటిల్ క్యారెక్టర్ లో నాని అదరగొట్టేశారనే ప్రశంసలను అందుకున్నారు. ఇద్దరు హీరోయిన్లు నటించిన ఈ సినిమాలో సాయిపల్లవి రోల్ బాగా హైలైట్ అయ్యింది.

ఈ రెండు సినిమాలలో ఫస్టాఫ్ సోసోగా సాగిపోగా, సెకండాఫ్ మాత్రం రెండు సినిమాలను నిలబెట్టింది. అలాగే ఓటీటీలో ఒకేసారి విడుదల కానున్నాయి. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ రిలీజ్ టైం సాధారణంగా రాత్రి 12 గంటలకు ఉంటుండగా, నెట్ ఫ్లిక్స్ రాత్రి 12 గంటలకు గానీ, మధ్యాహ్నం 1.30 గంటలకు గానీ విడుదల చేస్తుంది.

ADVERTISEMENT
Latest Stories